Dussehra Festival: దసరా పండుగ రోజు చేయవలసినవి, చేయకూడనివి ఇవే!
మత విశ్వాసాల ప్రకారం.. దసరా నాడు సాయంత్రం ప్రదోష కాలంలో రావణ దహనం చేయడం శుభప్రదం. పంచాంగం ప్రకారం.. అక్టోబర్ 2, 2025న సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ప్రదోష కాలం ఉంది.
- By Gopichand Published Date - 05:45 AM, Fri - 19 September 25

Dussehra Festival: హిందువులకు దసరా పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దసరా (Dussehra Festival)ను విజయదశమి అని కూడా పిలుస్తారు. హిందూ పంచాంగం ప్రకారం.. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసం, శుక్ల పక్షం, దశమి తిథి నాడు దసరా పండుగ జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. త్రేతాయుగంలో ఇదే రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతను రక్షించాడు. అప్పటి నుంచి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రాముడిని పూజించి, రావణ దహనం చేస్తారు.
రావణుడి బొమ్మను చేసి దానిని కాల్చడాన్ని రావణ దహనం అంటారు. దసరా నాడు రావణుడి బొమ్మతో పాటు అతని సోదరుడు కుంభకర్ణుడు, కొడుకు మేఘనాథ్‌ల బొమ్మలను కూడా కాలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో రావణుడి సోదరి శూర్పణఖ, ఇతర రాక్షసుల బొమ్మలను కూడా కాలుస్తారు. ఇదే రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి విజయం సాధించింది. 2025లో దసరా పండుగ ఎప్పుడు వస్తుందో? రావణ దహనానికి శుభ ముహూర్తం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Buying First Car: కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
2025లో దసరా ఎప్పుడు?
ద్రిక్ పంచాంగ్ ప్రకారం.. ఈసారి అక్టోబర్ 1, 2025 సాయంత్రం 7:01 గంటల నుంచి మరుసటి రోజు అక్టోబర్ 2 సాయంత్రం 7:10 గంటల వరకు ఆశ్వీయుజ మాసం, శుక్ల పక్షం, దశమి తిథి ఉంటుంది. ఈ కారణంగా అక్టోబర్ 2, 2025 గురువారం నాడు దసరా పండుగ జరుపుకుంటారు. ఈ రోజున మధ్యాహ్నం 2:28 గంటల నుంచి 3:16 గంటల వరకు పూజకు విజయ ముహూర్తం ఉంది. మధ్యాహ్నం 1:40 గంటల నుంచి సాయంత్రం 4:03 గంటల వరకు అపరాహ్న కాలం ఉంటుంది.
రావణ దహనం ఏ సమయంలో చేయాలి?
మత విశ్వాసాల ప్రకారం.. దసరా నాడు సాయంత్రం ప్రదోష కాలంలో రావణ దహనం చేయడం శుభప్రదం. పంచాంగం ప్రకారం.. అక్టోబర్ 2, 2025న సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ప్రదోష కాలం ఉంది. ఈ సమయంలో మీరు రావణ దహనం చేయవచ్చు.
దసరా రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు?
- ఎవరితోనూ గొడవ పడకూడదు.
- ఎవరి గురించీ చెడుగా మాట్లాడకూడదు.
- చెడు పనులు, చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి.
- పశుపక్షులను హింసించకూడదు.
- ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, అపరిశుభ్రతకు తావు ఇవ్వకూడదు.
- దానధర్మాలు చేయాలి.
- ఇంట్లో దీపాలు వెలిగించాలి.
- శ్రీరాముడు, దుర్గాదేవిని పూజించాలి.
- బంగారం, వెండి లేదా ఏదైనా కొత్త వస్తువును తప్పకుండా కొనాలి.