Diwali – 5 Days : ఐదురోజుల దీపావళి వేడుకల విశేషాలివీ..
Diwali - 5 Days : తదుపరిగా రాబోయే పెద్ద పండుగ దీపావళి. ఈసారి నవంబర్ 12న కార్తీక అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటారు.
- By Pasha Published Date - 12:15 PM, Fri - 27 October 23

Diwali – 5 Days : తదుపరిగా రాబోయే పెద్ద పండుగ దీపావళి. ఈసారి నవంబర్ 12న కార్తీక అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటారు. ఆ రోజున లక్ష్మీదేవి స్వయంగా రాత్రిపూట భూలోకానికి వచ్చి ఇంటింటికీ తిరుగుతుందని చెబుతారు. అందుకే దీపావళి రోజున ఇళ్ళు, వాకిళ్ల చుట్టూ దీపాలు వెలిగిస్తారు. కార్తీక అమావాస్య తిథి నవంబర్ 12న మధ్యాహ్నం 02:44 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు (నవంబర్ 13న) మధ్యాహ్నం 02:56 గంటలకు ముగుస్తుంది. ఆ రోజున ప్రదోషకాల సమయంలో లక్ష్మీదేవిని(Diwali – 5 Days) పూజిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
ఐదు రోజుల వేడుక ఇలా..
- వాస్తవానికి దీపావళి ఫెస్టివల్ నవంబరు 10న ధన్ తేరస్ రోజున ప్రారంభమై భాయ్ దూజ్ (నవంబర్ 14) వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతుంది.
- దీపావళి పండుగ నవంబర్ 10న ధన్‌తేరస్‌తో ప్రారంభమవుతుంది.
- దీపావళి రెండో రోజున (నవంబర్ 11) త్రయోదశి తిథి ఉంటుంది. ఆ రోజును చిన్న దీపావళిగా పిలుస్తారు. ఈ రోజున హనుమంతుడిని పూజిస్తారు.
- దీపావళి మూడో రోజున (నవంబర్ 12) చతుర్దశి తిథి ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ప్రజలు తమ ఇళ్లను దీపాలతో వెలిగిస్తారు.
- దీపావళి నాలుగో రోజున (నవంబర్ 13) అమావాస్య తిథి ఉంటుంది.
- దీపావళి ఐదో రోజున (నవంబర్ 14) ప్రతిపాద తిథి ఉంటుంది. ప్రజలు గోవర్ధన పూజతో 5 రోజుల దీపావళి పండుగను ముగిస్తారు.
దీపావళి ప్రాముఖ్యత
హిందూ పురాణాల ప్రకారం.. రావణుడిపై విజయాన్ని సాధించిన రాముడు దీపావళి రోజున సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చారు. దీంతో ఆయన 14 సంవత్సరాల అజ్ఞాతవాసం కూడా ముగిసింది. అందుకే ఈరోజును చెడుపై మంచి సాధించిన విజయోత్సవంగా జరుపుకుంటారు.
Also Read: Volunteer Illegal Affair : పెళ్లైన మహిళతో వాలంటీర్ ఎఫైర్..భర్త ఆత్మహత్య
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.