God Vows: దేవుడు మొక్కు ఆలస్యంగా చెల్లిస్తే ఏమవుతుంది.. మొక్కు చెల్లించకపోతే దేవుడు ఆగ్రహిస్తాడా?
దేవుడికి ముక్కుకున్న మొక్కు ఆలస్యంగా చెల్లిస్తే ఏమవుతుంది అలా చెల్లిస్తే దేవుడు ఆగ్రహిస్తాడా ఈ విషయాల గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:34 PM, Sat - 18 January 25

మనం మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవుడిని పూజిస్తూ కోరికలు తీర్చమని వేడుకుంటూ కోరికలు తీరితే మొక్కుబడి చెల్లిస్తామని మొక్కుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు కోరికలు తీసిన తర్వాత ఆ ఆనందంలో కొందరు వాటిని మర్చిపోతూ ఉంటారు. ఆ మొక్కుబడిని మరిచిపోయి ఆ తర్వాత ఎప్పుడో మొక్కుబడిని తీరుస్తూ ఉంటారు.. అయితే ఇళ్లలోనే ఉండి దేవుడికి తమ కష్టం గురించి చెప్పుకునే వాళ్లు మరికొందరు. తీరా ఆ కష్టం నుంచి బయటపడగానే కొందరు మొక్కు సంగతి మర్చిపోతారు. సమయం లేకపోవటం, డబ్బులు సమకూరక పోవడం వల్ల కూడా మొక్కు తీర్చడం ఆలస్యం కావచ్చు.
కొందరైతే మొక్కుకోసం దాచిన డబ్బును వేరే అవసరాలకు కూడా వాడే స్తుంటారు. మరికొందరైతే తీర్చుకుందాంలే అని తార్చారం చేస్తుంటారు. అయితే మొక్కు తీర్చుకోకపోవడం దోషమా? మొక్కులు తీర్చుకోకపోతే దేవుడికి కోపం వస్తుందా? మరోసారి కష్టం వచ్చింది తీర్చమంటే పట్టించుకోడా? ఈ విషయాల గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాజిటివ్ ఎనర్జీ కష్టాల్ని భరించలేని స్థితిలో దేవుడిపై భారం వేయడం వల్ల మనసుకు ఒక రకమైన భరోసా లభిస్తుంది. దేవుడిని మానవ తీత బంధంలా భక్తులు భావిస్తారు కాబట్టి శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో మానసికంగా ధైర్యంగా ఉంటారు. ఫలితంగా సరైన నిర్ణయాలు తీసుకోడానికి మనసు సిద్ధం అవుతుంది. ఒత్తిడి నుంచి కొంతవరకు బయట పడగలుగుతారు.
ప్రశాంతత లభిస్తుంది. దీంతో సమస్యల గురించి లోతుగా ఆలోచించి ఎవరికి వాళ్లే పరిష్కరించుకోగలుగుతారు. తోటి మనుషులు ఏ సహాయం చేయకున్నా దేవుడు మంచి చేస్తాడు. సాయం అందిస్తాడు అనే సమ్మకం మనిషిని కచ్చితంగా ముందుకే నడిపిస్తుంది. మళ్లీ కష్టాలకి కారణం దేవుడేనా మొక్కు ఇచ్చినమాట నిలబెట్టుకోవడం లాంటిది. మొక్కు చెల్లించడం అంటే భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే. అది తీర్చకపోతే నిరంతరం మనసును వేధిస్తూనే ఉంటుంది. దీంతో మరోసారి కష్టం వచ్చినప్పుడు దేవుడిని మొక్కు కోడానికి వెనకాడతారు. దేవుడు ఏమీ చేయకపోయినా భక్తులు మాత్రం ఫలానా సమయంలో అనుకున్న మొక్కు తీర్చకపోవడం వల్లే మళ్లీ కష్టం వచ్చిందని అనుకుంటారు. కానీ వాస్తవానికి దేవుడు మొక్కు చెల్లించలేదని కష్టాలు పెడతాడు అనేది భక్తుల ఆలోచన మాత్రమే. దేవుడు శిక్షించడం, పగ తీర్చుకోవడం వంటివి భక్తుల నమ్మకం నుంచి పుట్టినవే. మొక్కు అనేది విశ్వాసంతో కూడుకున్నది మాత్రమేనని పండితులు చెబుతున్నారు. కాబట్టి భగవంతుడిపై ఉన్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులు పోగొట్టుకోకూడదట.