Eye Twitch: ఎడమ కన్ను అదిరితే దేనికి సంకేతం? ఎలాంటి ఫలితం వస్తుంది?
భారతదేశంలో హిందువులు అనేక రకాల సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. వీటితో పాటుగా కొన్ని నమ్మకాలను, ఆచారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఇక ఏదైనా శుభకార్యం మొదలు పెట్టే సమయంలో ఎక్కువగా ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు.
- By Anshu Published Date - 05:45 AM, Fri - 2 September 22

భారతదేశంలో హిందువులు అనేక రకాల సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. వీటితో పాటుగా కొన్ని నమ్మకాలను, ఆచారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఇక ఏదైనా శుభకార్యం మొదలు పెట్టే సమయంలో ఎక్కువగా ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అలాగే మనుషులు ఎక్కువగా నమ్మే వాటిలో ఎడమ కన్ను అదరడం,కుడి కన్ను వదలడం లాంటివి కూడా శుభ సూచకంగా అశుభ సూచకంగా భావిస్తూ ఉంటారు. ఇందులో ఆడవారికి, మగవారికి కన్ను అదిరితే విభిన్న ఫలితాలు ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆడవారికి ఎడమ కన్ను అదిరితే మంచిదని, మగవారికి కుడి కన్ను అదిరితే మంచిది అని చెబుతూ ఉంటారు.
స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే ఏదైనా పని ప్రారంభించిన లేదంటే పని గురించి ఆలోచన వచ్చిన అది విజయవంతం అవుతుందని, అలాగే మగవారికి కుడి కన్ను అదిరితే మంచి జరుగుతుందని చెబుతూ ఉంటారు. అలాగే మగవారు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు వారికి కుడి కన్ను అదిరితే అది కచ్చితంగా విజయవంతం అవుతుంది అని పెద్దలు చెబుతుంటారు. మరి మగవారికి ఎడమ కన్ను అదిరితే ప్రభావం ఎక్కువగా ఉంటుందని, చెడుకు సూచనగా ఎడమ కన్ను అదురుతుంది అని పెద్దలు విశ్వసిస్తూ ఉంటారు.
అలాగే ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు లేదంటే పని మొదలుపెట్టాలని అనుకున్న సమయంలో ఎడమ కన్ను అదిరితే ఆ పనిని వాయిదా వేయాలని పెద్దలు చెబుతారు. ఇది మగవారికి ఏ విధంగా అయితే ఎడమ కన్ను అదిరితే చెడు ప్రభావం కనిపిస్తుంది అని చెబుతారో ఆడవారికి కూడా కుడి కన్ను అదిరితే అదే విధంగా చెడు ప్రభావం ఏర్పడుతుందట. ఇది ఆడవారికి కుడి కన్ను అదిరితే బంగారాన్ని కంటికి హత్తుకోవాలని, చక్కర నోట్లో వేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. లేదు అంటే దేవుడికి దండం పెట్టుకున్నా కూడా ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవని పెద్దలు చెబుతుంటారు.