HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >What Kind Of Pooja Should Be Performed By Which Zodiac Sign On Shivratri Day

Shivratri: శివరాత్రి రోజున ఏ రాశి వారు ఎలాంటి పూజ చేయాలి?

మహాశివరాత్రి రోజున మీ రాశిని అనుసరించి ఎలాంటి పూజ (Pooja) చేయడం శ్రేయస్కరం?

  • Author : Vamsi Chowdary Korata Date : 13-02-2023 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shivratri
Shivratri

శివ పురాణం చెప్పిన దాన్ని బట్టి శివరాత్రి (Shivratri) రోజున అగ్నిలింగ ఆవిర్భావంతో సృష్టి ప్రారంభమైంది. అగ్ని లింగం అంటే ఆ మహా దేవుడి బృహద్రూపం. సంవత్సరంలో 12 శివరాత్రులు ఉన్నప్పటికీ ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ శివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఇది మహా శివరాత్రి అయ్యింది. ఈరోజున శివారాధకులు పూర్తి భక్తి విశ్వాసాలతో శంకరుని కొలుచుకుంటారు. కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం వల్ల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మహాశివరాత్రి (Shivratri) రోజున మీ రాశిని అనుసరించి ఎలాంటి శివారాధన చేసుకోవచ్చనే ఇక్కడ తెలుసుకుందాం.

మేషరాశి

మేషరాశి వారు ఎర్రచందనం, ఎరుపు రంగు పువ్వులతో శివ పూజ చేసుకోవాలి. తర్వాత ఓం నమోః నాగేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 51 లేదా 108 సార్లు జపించాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారు మల్లెపూలతో శివారాధన చేసుకోవాలి. తర్వాత రుద్రాష్టకం చదువుకోవాలి.

మిథున రాశి

మిథున రాశి వారు ధాతురా, గంగా జలంతో శివాభిషేకం చేసుకోవాలి. ధాతురాను శివునికి సమర్పించే సమయంలో పంచాక్షరీ మంత్ర పఠనం చెయ్యాలి. ఓం నమః శివాయః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు జనపనారతో కలిపిన ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేసి రుద్రాష్టాధ్యాయిని పఠించాలి.

సింహ రాశి

సింహ రాశి వారు మహా శివరాత్రి నాడు ఎర్రని తామరలతో శివుడికి పూజ చేసుకోవాలి. శివాలయంలో శ్రీ శివ చాలీసా పారాయణం చెయ్యాలి.

కన్యా రాశి

కన్యారాశి వారు బిల్వపత్రం, ధాతురా, భాంగ్ వంటి పదార్థాలతో పూజచేసుకుని పంచాక్షరీ ఓం నమః శివాయః అనే మంత్రాన్ని జపించాలి. దీనితో పాటు శివ చాలీసాను కూడా పఠించాలి.

తులా రాశి

తులరాశి వారు మహాశివ రాత్రి రోజున శివాష్టకం పఠించాలి. దీనితోపాటు, పెరుగు లేదా చక్కెర మిఠాయి కలిపిన పాలతో శివలింగాన్ని అభిషేకించి శివ సహస్ర నామాన్ని పఠించాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు గులాబి పువ్వులు , బిల్వ పత్ర మాలతో శివ పూజ చేసుకోవాలి. తర్వాత రుద్రాష్టక స్తుతి చేసుకోవాలి. దీనితో పాటు ఓం అంగరేశ్వరాయ నమ: మంత్రాన్ని జపించాలి.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారు మహా శివరాత్రి రోజున పసుపు రంగు పూలతో శివ పూజ చెయ్యాలి. పాయసం ప్రసాదంగా సమర్పించుకోవాలి. శివాష్టకం పఠించాలి.

మకర రాశి

మకర రాశి వారు ధాతుర, భాంగ్, అష్టగంథ వంటి వాటితో పూజ చేసుకోవాలి. ఓం పార్వతి నాథాయ నమ: అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

కుంభరాశి

కుంభరాశి వారు పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనేతో విడివిడిగా అభిషేకం చేసి ఓం నమ: శివాయ నమ: మంత్రాన్ని జపిస్తూ శివాష్టకం కూడా చదువుకోవాలి.

మీనరాశి

మీన రాశి వారు మహా శివరాత్రి రోజున శివలింగానికి పంచామృతం, పెరుగు పాలుతో అభిషేకం చేసుకోవాలి. పసుపు రంగు పూలను మహాదేవుడికి సమర్పించుకోవాలి. పూజ ముగిసిన తర్వాత గంధపు మాలతో ఓం భమేశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జరిపించాలి.

Also Read:  Mahashivratri: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలాయె!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • festival
  • pooja
  • Rashi
  • shivratri
  • zodiac sign

Related News

Why should a husband and wife stay apart during the month of Ashadha?

Ashada Masam 2026: ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు దూరంగా ఉండాలి?

హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఉండనుంది. ఈ మాసం రాగానే కొత్తగా పెళ్లైన దంపతులను ఒకరికొకరు దూరంగా ఉంచడం, వధువును పుట్టింటికి పంపించడం మన సమాజంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే దీని వెనుక కేవలం సెంటిమెంట్లు, నమ్మకాలు మాత్రమే కాకుండా పూర్వీకులు ఆలోచించిన అద్భుతమైన వైజ్ఞానిక, సామాజిక కారణాలు దాగి ఉన్న

  • Why is *Thamboolam* (betel leaves and areca nuts) offered? On what occasions is it given? What is its significance?

    Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd