Tirumala: ఏడుకొండలస్వామిని దర్శించుకోవడానికి ఏవారం మంచిందంటే!
శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు మన జీవితం ధన్యమౌతుంది.
- Author : Hashtag U
Date : 27-06-2023 - 11:26 IST
Published By : Hashtagu Telugu Desk
అఖిలాండకోటి బ్రహ్మాండనాయ కుడైన శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు మన జీవితం ధన్యమౌతుంది. కొండ లలో నెలకొన్న కోనేటిరాయుడ్ని కళ్లారా దర్శించుకోవాలనే ఆతృతతో క్షణకాలం మాత్ర మే లభించే శ్రీవారి దివ్యమంగళరూప దర్శ నంకోసం తహతహలాడతాము.
శ్రీనివాసుడ్ని ఆదివారం దర్శిం చుకుంటే రాజానుగ్రహం, ప్రభుత్వాధినేతల దర్శనం, అధికార కార్యానుకూలత, శత్రు నాశనం, నేత్ర, శిరోబాధలనుండి ఉపశమ నం వంటి ఫలితాలు కలుగుతాయని పురాణవచనం.
సోమవారం శ్రీవారిని దర్శించు కుంటే, స్త్రీసంబంధంగా పనుల సానుకూ లత, తల్లికి, సోదరీమణులకు శుభం, వా రినుండి ఆదరణ, భాగస్వామితో అన్యో న్యత కలుగుతాయి. మంగళవారం శ్రీవారిని దర్శించు కుంటే భూమికి సంబంధించిన వ్యవహారా ల్లో కార్యసిద్ధి, భవననిర్మాణ పనులకు అవ రోధాలు తొలగి, కార్యానుకూలత కలుగుతాయి. బుధవారం స్వామిని దర్శించు కుంటే విద్యాప్రాప్తి, విదేశీయానం, సామాజి క గౌరవం లభిస్తాయి.
గురువారం స్వామిని దర్శించు కుంటే ఉత్తమ జ్ఞానలాభం, వాక్శుద్ధి, గురు వుల ఆశిస్సులు లభిస్తాయి. శుక్రవారం గోవిందుడ్ని దర్శించు కుంటే సమస్త భోగభాగ్యాలు, వాహనసౌ ఖ్యం, ఇష్టకార్యసిద్ధి వంటి ఫలితాలు కలుగుతాయి. శనివారం ఏడుకొండలస్వామిని దర్శించుకుంటే రుణపీడ, ఈతిబాధలు తొలగుతాయని పురాణాలు చెప్తున్నాయి. పౌర్ణమినాడు గరుడవాహనంపై ఊరేగే శ్రీవారిని దర్శించుకుంటే సకల సౌభా గ్యాలు కలుగుతాయి.
Also Read: Alcohol Effects: అతిగా తాగితే అనర్ధమే.. మద్యంతో ముసలితనం వస్తుందట!