Elephants At Home: వెండి ఏనుగులను ఇంట్లో పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఇంట్లో వెండి ఏనుగు విగ్రహాలను పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 10:30 AM, Tue - 15 October 24

భారతదేశంలో హిందువులు వాస్తు శాస్త్రాన్ని తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉంటారు. స్థలం కొనుగోలు చేసే విషయం నుంచి ఇల్లు నిర్మించి అందులో వస్తువులను అమర్చుకునే వరకు ప్రతి ఒక్క విషయంలో వాస్తు నియమాలను పాటిస్తుంటారు. అలాగే వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్నో రకాల వస్తువులను కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో వెండి ఏనుగు విగ్రహాలు కూడా ఒకటి. ఇంట్లో ఏనుగుకు సంబంధించిన బొమ్మలు ఉంచడం వల్ల ఎంతో మంచిది.
సాధారణ ఏనుగు బొమ్మల కంటే వెండితో చేసిన ఏనుగు బొమ్మలు ఇంట్లో పెడితే మరింత శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. వెండి ఏనుగులను ఇంట్లో ఉత్తరం దిక్కులో ఉంచడం వల్ల వాస్తు దోషాలు అన్నీ తొలగి పోతాయట. అదే విధంగా ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ కూడా నెలకొంటుందని చెబుతున్నారు. వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో దేవుడి గదిలో పెడితే ఆర్థిక కష్టాలు, సమస్యలు అన్నీ పోతాయట. ఇలా చేస్తే ఇంట్లో ధనానికి అస్సలు లోటు ఉండదట. ఇల్లు అష్టైశ్వర్యాలతో కళకళలాడుతూ ఉంటుందని చెబుతున్నారు.
మీరు చేసే ఆఫీస్ లో లేదా వ్యాపార సంస్థల్లో ఈ వెండి ఏనుగు విగ్రహాలు పెడితే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందట. ఇంట్లో వెండి లోహంతో చేసే ఏనుగు బొమ్మలు పెడితే,నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందని చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందట. ఇతర రంగుల కంటే తెల్ల ఏనుగు విగ్రహాలు ఉంటే ఇట్లో సందకు లోటు ఉండదని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు.