Spirituality: మీరు తరచూ గుడికి వెళ్తున్నారా.. అయితే తప్పకుండా ఈ నియమాలు పాటించాల్సిందే
Spirituality: తరచుగా గుడికి వెళ్ళడం మాత్రమే కాకుండా, అలా ఆలయాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Wed - 12 November 25
Spirituality: మామూలుగా ఆలయాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం ఇంటికి దగ్గరగా ఉన్నా లేదంటే ఎక్కడైనా దూరంగా ఉన్నా సరే ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు తప్పనిసరిగా కాళ్లు చేతులు ముఖం శుభ్రం చేసుకున్న తరువాతనే ఆలయంలోకి ప్రవేశించాలని చెబుతున్నారు. ఉపవాసంతో గుడికి వెళ్లేవారు ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారికి ఏదైనా తినిపించడం లేదంటే తాగించడం చేసిన తర్వాత గుడికి తీసుకుని వెళ్ళవచ్చని చెబుతున్నారు.
అలాగే గుడికి వెళ్ళేటప్పుడు మనం పూజ సామాగ్రి అనగా టెంకాయ, పూలు,కాయలు,ఆకు, వక్కతో పాటుగా ఒక రూపాయి బిళ్ళను కూడా దేవుడికి సమర్పించాలట. ఇలా సమర్పించినప్పుడే మనం ఆశించిన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. అలాగే గుడికి వెళ్లిన ప్రతిసారి ఇలా పూజా సామాగ్రిని తీసుకుని వెళ్లాలి అన్న నియమాలు ఏమీ లేవని చెబుతున్నారు. అదేవిధంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ముందుగా ఆ గుడిలో ఉన్న విఘ్నేశ్వరుడుని దర్శనం చేసుకున్న తరువాతే మిగిలిన దేవుళ్ళను దర్శనం చేసుకోవాలని చెబుతున్నారు.
కొంతమంది గుడిలో మూలవిరాట్ దగ్గర భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు అని మొదటి నవగ్రహాలను దర్శనం చేసుకోవడం ప్రదర్శనలు చేయడం వంటివి చేస్తుంటారు. కానీ ఇలా అసలు చేయకూడదట. ఎక్కడికి వెళ్లినా కూడా మొదట మూలవిరాట్ ను దర్శించుకున్న తర్వాత ఇంటికి వచ్చే ముందు నవగ్రహాలను దర్శనం చేసుకుని పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. ఇలా తిరిగి వచ్చే సమయంలో కాశీలోని నవగ్రహాలకు వంగి నమస్కారం చేయకూడదు అన్న నమ్మకం ఉంది. అలాగే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఎప్పుడూ కాళ్లు చేతులు శుభ్రం చేసుకోకూడదట. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే ఆలయం నుంచి వచ్చిన పవిత్రతను కొద్దిసేపు నిలుపుకోవాలట. కాబట్టి మీరు ఆలయాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించడం మంచిదని పండితులు చెబుతున్నారు.