Kanaka Durga Temple Income : విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆదాయం.. గత 19 రోజులకు గాను..
ఇంద్రకీలాద్రిపై ఉన్న అన్ని హుండీలను లెక్కించగా 3,12,45,632 రూపాయల ఆదాయం(Income) వచ్చింది.
- Author : News Desk
Date : 05-09-2023 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడ(Vijayavada) ఇంద్రకీలాద్రిపై(Indrakeeladri) దుర్గమ్మ(Kanaka Durga) హుండీల(Hundi) లెక్కింపు జరిగింది. 19 రోజులకు గాను ఈ హుండీలను లెక్కించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న అన్ని హుండీలను లెక్కించగా 3,12,45,632 రూపాయల ఆదాయం(Income) వచ్చింది. సగటున ఒక రోజుకు రూ.16.44 లక్షలు ఆదాయం వచ్చింది. ఇవి కేవలం మన కరెన్సీ రూపంలో వచ్చిన ఆదాయం. ఇదే కాకుండా బంగారం(Gold), వెండి(Silver), విదేశీ కరెన్సీ(Forign Currency), ఆన్లైన్ రూపంలో మరింత ఆదాయం వచ్చింది.
దుర్గమ్మ అమ్మవారికి కానుకల రూపంలో బంగారం 800 గ్రాములు రాగా వెండి 6 కేజీల 600 గ్రాములు వచ్చింది. ఇక విదేశీ కరెన్సీ
USA – 715 డాలర్లు,
కెనెడా – 210 డాలర్లు,
ఆస్ట్రేలియా – 225 డాలర్లు,
సింగపూర్ – 120 డాలర్లు,
చైనా – 1000 యువాన్లు,
ఇంగ్లాండ్ – 10 పౌండ్లు,
మలేషియా- 23 రింగెట్లు,
ఒమాన్ – 2.5 రియాల్,
క్వతార్ – 142 రియాల్,
స్వీడెన్ – 120 క్రొనార్,
UAE – 285 దిర్హమ్స్,
కువైట్ – 1.75 దినార్లు,
సౌదీ – 1 రియాల్ వచ్చాయి. వీటితో పాటు ఆన్లైన్ లో e – హుండీ ద్వారా 1,07,275 రూపాయల విరాళం వచ్చింది. ఈవో ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఈ హుండీలను లెక్కించారు. త్వరలో దసరా వస్తుండటంతో దసరా శరన్నవరాత్రి వేడుకలకు కావాల్సిన ఏర్పాట్లను మొదలుపెట్టనున్నట్టు తెలిపారు ఆలయ అధికారులు.
Also Read : Vijayawada Kanaka Durga Temple : ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల షెడ్యూల్..