Vasthu Tips: వాస్తు ప్రకారం దీపావళి రోజు ఈ విధంగా చేస్తే చాలు.. లక్ష్మి ఇంటికి నడుస్తూ రావాల్సిందే!
Vasthu Tips: వాస్తు ప్రకారం దీపావళి పండుగ రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే సంపద కలిసి వస్తుందని అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు పండితులు. మరి దీపావళి పండుగ రోజు ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Sat - 18 October 25

Vasthu Tips: ఈనెల 20వ తేదీన హిందువులు దీపావళి పండుగను జరుపుకోనున్నారు. అయితే ఈ దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని విష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజున కొన్ని పనులను చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు. మరీ ఇంతకీ దీపావళి పండుగ రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చాలామంది పూజలు చేస్తుంటారు.
ఆ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలగాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు. ఇంటిని ఊడ్చి, కడిగి శుభ్రంగా ఉంచుకోవాలట. ఎక్కడా చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలట. రంగురంగుల పూలతో అలంకరించుకోవాలని, ఆ రోజు ఇంటిముందు దీపాలు పెట్టాలట. ఇలా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలిగి సంపద వస్తుందని చెబుతున్నారు. ఇంట్లో ఈశాన్యంలో దీపం వెలిగిస్తే చాలా మంచిదట.
ఈ శాన్యంలో దీపం వెలిగించడం వల్ల ఆర్థికంగా ఆర్థికంగా కలిసివస్తుందట. వ్యాపారం కూడా బాగా కలిసివస్తుందని, ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. అయితే ఇందుకోసం ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసి ఇంటిని దీపాలతో చక్కగా అలంకరించడం వల్ల దీపావళి వెలుగులతో కళకళలాడుతుందట. అయితే చాలామంది ఒక దీపం వెలిగించి ఊరుకుంటారు. కానీ అలా చేయకూడదట. సాధ్యమైనంత వరకు, శక్తి మేరకు దీపాలు వెలిగించుకుంటే మంచిదని, కనీసం రెండైనా వెలిగించాలని చెబుతున్నారు. ఈశాన్యంలో దీపం పెట్టడం వల్ల అదృష్టం బాగా కలిసివస్తుందట. ఆ రోజు లక్ష్మీదేవి చిత్రపటాన్ని బంగారం, వెండి నాణాలను కొని ఉంచుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.