Betel Leaf: ఈ ఆకుతో పరిహారం పాటిస్తే చాలు.. కాసుల వర్షమే?
తమలపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. తమ పాకులను
- By Anshu Published Date - 06:00 AM, Wed - 1 February 23

తమలపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. తమ పాకులను హిందువులు పూజా సమయంలో తాంబూలం గా అలాగే అభిషేకం చేయడానికి ఆకు పూజ కట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే తమలపాకును పాన్ బిడా, పాన్ వంటి వాటిలో కూడా ఉపయోగిస్తుఉంటారు. తమలపాకు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. తమలపాకును ఉపయోగించి ఆర్థిక సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. మరి ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మంగళవారం లేదా శనివారం హనుమంతునికి తమలపాకులను సమర్పించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించడం వల్ల మీరు అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి. అలాగే చాలా కాలం నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, వ్యాపారంలోని నష్టపోతున్న వారు ఈ పరిహారం పాటించవచ్చు. అందుకోసం ఆదివారం రోజున బయటకు వెళ్ళినప్పుడు జేబులో లేదా పర్సులో తమలపాకును పెట్టుకోవడం వల్ల అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. అలాగే ఫ్యామిలీలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటే ఈరోజు సాయంత్రం తమలపాకు మీద కర్పూర అన్ని వెలిగించాలి.
ఈ విధంగా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అలాగే ఇంట్లో కలహాలు తొలగిపోయి ఆ ఇల్లు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఒక తమలపాకు రెండు లవంగాలను నెయ్యిలో ముంచి పెనంపై ఉంచాలి. తర్వాత అగ్గిలో ఆకుని కాల్చాలి. ఆ విధంగా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ గదిలో లక్ష్మీదేవి పాదాల వద్ద తమలపాకును ఉంచాలి. ఆ తమలపాకుపై కుంకుమను నానబెట్టి తిలకం వేయాలి. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ రకమైన పరిహారం పాటించడం వల్ల అనుకున్న పనులు పూర్తి అవ్వడంతో పాటు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.