Vastu Tips: విఘ్నేశ్వరుడికి ఇష్టమైన దర్భను ఇంట్లో ఎక్కడ ఉంచాలి.. ఏ దిశ అనుకూలమో మీకు తెలుసా?
Vastu Tips: అదృష్టం కలిసి రావాలి ఐశ్వర్యం కలగాలి అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన దర్బను ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే దిశలో ఉంచాలి అని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు.
- Author : Anshu
Date : 11-12-2025 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
Vastu Tips: ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు అదృష్టం కలిగి, డబ్బు రావాలి అంటే, ధన ప్రవాహం ఆగకుండా ఉండాలి అంటే వాస్తు నియమం ప్రకారం విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన దర్భ లేదా గడ్డిని ఇప్పుడు చెప్పబోయే దిశలో పెట్టాలి అని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు. దర్భగడ్డి ఇంట్లో ఉంటే సంపద, శాంతి చేకూరుతుందట. ఈ పవిత్రమైన దర్భ గడ్డిని ఇంట్లోని తూర్పు మూలలో లేదంటే ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఇది ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుందట. వాస్తు ప్రకారం దర్భ గడ్డిని ఉంచడానికి ఉత్తమ దిశలు, వాటి ద్వారా కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా దర్భ గడ్డి చాలా పవిత్రమైనది. ఇది గణేశుడికి అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు. అందువల్ల దర్భ గడ్డిని జాగ్రత్తగా నాటి, నిర్వహించడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచే ప్రతి మొక్క సానుకూల లేదా ప్రతికూల శక్తిని విడుదల చేస్తుందట. దర్భ గడ్డి ఎంత పచ్చగా, తాజాగా కనిపిస్తే, ఆ ఇంట్లో అంత ఆనందం, అభివృద్ధి కలుగుతాయని నమ్మకం. అందుకే ఈ మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోయడం అవసరం. మొక్క ఎండిపోవడం అశుభకరంగా పరిగణిస్తారు. దర్భ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తిని దూరం చేస్తుందట.
దీని ఉనికి శాంతియుతమైన, సామరస్య పూర్వకమైన వాతావరణాన్ని, శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. దర్భ గడ్డిని ఉంచడానికి ఉత్తమ దిశలు ఏవి అన్న విషయానికి వస్తే.. ధనం, ఆర్థిక వృద్ధి కోసం దర్భను ఈశాన్య మూలలో ఉంచాలట. ఈ దిశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని నమ్మకం. ఇక ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఇంటి గుడి దగ్గర ఈ మొక్కను ఉంచడం వలన దైవానుగ్రహం పెరుగుతుందట. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సామరస్యం కోసం దర్భ గడ్డిని ఆగ్నేయ మూలలో నాడడం మంచిదని చెబుతున్నారు. తగాదాలు, అంతర్గత కలహాలు ఉంటే అవి తొలగిపోవడం కోసం ఈ మొక్కను నైరుతి మూలలో ఉంచాలట. విద్యార్థులు ఏకాగ్రత సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. ఏకాగ్రత, విద్యా సంబంధిత పనితీరు మెరుగుపడటానికి స్టడీ డెస్క్ పై చిన్న దర్భ మొక్కను ఉంచాలని చెబుతున్నారు.