Money: ఇతరులకు ఇచ్చిన డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారా.. వెంటనే ఈ పని చేయండి!
ఇతరులకు ఇచ్చిన డబ్బులు రాక చాలామంది ఇబ్బంది పడుతూ వసూలు చేసుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఒక చక్కటి పరిష్కారం పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:15 PM, Fri - 13 December 24

చాలామంది కొన్ని కొన్ని సార్లు నిత్య అవసరం పడిందని ఇతరులతో డబ్బులు ఇప్పించుకోవడం, లేదంటే ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది డబ్బులు ఇప్పించుకున్నప్పుడు బాగానే తీసుకొని తిరిగి ఇవ్వడానికి పదేపదే అడిగించుకోవడం ఇళ్ల వద్దకు తిప్పించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. పైగా ఈరోజు ఇస్తాం రేపు ఇస్తాము అని మాట దాటేస్తూ ఉంటారు. దాంతో ఇచ్చిన డబ్బులు తిరిగి వసూలు చేయలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కొట్టడం పోట్లాడుకోవడం తిట్టుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.
అయితే వాటితో పని లేకుండా ఒక చక్కటి పరిష్కారం పాటిస్తే మీకు ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుందని పండితులు చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ డబ్బు ఎవరి వద్ద అయినా చిక్కుకుపోయి ఉంటే, ఆ డబ్బులు తిరిగి రావడం లేదు అనుకున్న వారు లవంగాలతో డబ్బులు సంపాదించుకోవచ్చట. అందుకోసం మీరు చేయాల్సిందల్లా 11 లేదా 21 లవంగాలను కర్పూరంతో కలిపి అమావాస్య లేదంటే పౌర్ణమి రోజు కాల్చాలట.
తర్వాత లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించాలట. ఈ విధంగా చేయడం వల్ల ఆటంకాలు అన్ని తొలగిపోయి మీకు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుందని అలాగే లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుందని చెబుతున్నారు. అలాగే ఇప్పుడైనా సరే డబ్బులు ఇతరులకు ఇచ్చేముందు మంగళవారం రోజున ఎట్టి పరిస్థితులలో అప్పుగా ఇవ్వకూడదని చెబుతున్నారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితులలో మంగళవారం రోజు డబ్బులు అప్పుగా తీసుకోకూడదట. ఇలా చేస్తే డబ్బును తిరిగి చెల్లించడం సాధ్యం కాదని అలాగే మనం అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా అంత త్వరగా రావని చెబుతున్నారు.