Vastu Tips: ఇంటి పైకప్పు పై చెత్త సామాన్లు ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా?
డబ్బు ఎంత సంపాదించినా మిగిలినడం లేదు, అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఆర్థిక సమస్యలు వెంటాడు. కష్టాలు చుట్టుముడుతున్నాయి అంటే ఒక
- By Anshu Published Date - 09:30 PM, Fri - 14 July 23

డబ్బు ఎంత సంపాదించినా మిగిలినడం లేదు, అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఆర్థిక సమస్యలు వెంటాడు. కష్టాలు చుట్టుముడుతున్నాయి అంటే ఒక రకంగా వాస్తు ప్రకారంగా కూడా కారణం కావచ్చు. అందుకే ఇంట్లో ఉండే అన్ని విషయాలలో వాస్తు నియమాలను పాటించడం తప్పనిసరి. ఇటువంటి వాటిలో మీ టెర్రస్ పై చెత్తను పేర్చడం కూడా ఒకటి. పల్లెటూరు సిటీ ప్రాంతాలలో చాలామంది ఉపయోగించని వస్తువులను ఇంటి పైకప్పు మీద వేసేస్తూ ఉంటారు. చెత్త చేరినా పట్టించుకోవడం లేకపోతే ఇంట్లో వారి అభివృద్ధికి ఆటంకాలు కొని తెచ్చుకున్నట్టే. ఇంట్లో గొడవలు పెరిగి మన:శాంతి కరువవుతుంది.
వాస్తు నియమాలను అనుసరించి ఇంటి పైకప్పు మీద ఎల్లప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి. డాబా మీద విరిగిపోయిన, పాడైపోయిన, వాడని వస్తువులు పడెయ్యడం మంచిది కాదు. ఇలా చేస్తే ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం నుంచి కుటుంబసభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాల వరకు అన్నింటి మీద వ్యతిరేక ప్రభావాలు పడతాయి. ఇంటి మీద చేరిన చెత్త సామాన్లను తొలగించకపోతే వాస్తు దోషాలతో పాటు పితృదోషాలు కూడా పీడిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంటి వాతావరణం పాడైపోతుంది. అభివృద్ధి నిలిచి పోతుంది. ఆర్థిక నష్టాలు కలుగుతాయి. పాడైపోయిన లేదా పనికిరాని సామాన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో లేదా డాబా మీద ఇలా ఎక్కడా పెట్టుకోకూడదు.
ఎప్పుడైనా పనికి వస్తాయనుకునే వస్తువులను డాబా మీద పడెయ్యకూడదు. అలాంటి వస్తువుల ఏవైనా ఉంటే వాటిని ఏదైనా వస్త్రంలో చుట్టి జాగ్రత్త చేసుకోవాలి,కానీ డాబా మీద పడెయ్యకూడదు. డాబా మీద ఎప్పుడూ శభ్రంగా ఉండేలా చూసుకోవాలి. డాబా మీద ఏవైనా వస్తువులు పెట్టాలని అనుకున్నా చెత్త కుప్పలాగా వెయ్యడం మంచిదికాదు అక్కడ పెట్టిన వస్తువులు కూడా ఒక క్రమపద్ధతిలో అందంగా శుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్త పడాలి. కాబట్టి ఇక మీదట ఇంటి పైకప్పు మీద పనికిరాని వస్తువులు లేకపోవడమే మంచిది. ఒకవేళ వేసిన కూడా అవన్నీ ఒక క్రమంలో అమర్చడం వల్ల మంచి జరుగుతుంది.