Vastu Tips: అప్పుల ఊబిలో కూరుకుపోయారా.. ఈ వాస్తు చిట్కాలతో అప్పులు తీరిపోవడం ఖాయం!
మీరు కూడా అప్పుల బాధలతో సతమతమవుతున్నారా, సంపాదించినది చేతిలో మిగలడం లేదా.. అయితే వెంటనే ఈ వాస్తు చిట్కాలను పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:04 PM, Mon - 27 January 25

వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని రకాల విషయాలను కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మనం పాటించే వాస్తు నియమాలు మనం ఎదుర్కొనే ఆర్థిక పరిస్థితుల నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయట. అలాగే రుణం నుండి విముక్తి లభిస్తుంది. రుణభారం నుంచి బయటపడేందుకు వాస్తు పరిష్కారాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. మరి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం ఎలాంటి వాస చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా కొందరికి అప్పులు ఎంతో ఇబ్బందులకు గురి చేయడంతో పాటు జీవితంలో మొత్తం సంపాదించినది అప్పులు తీర్చడానికి సరిపోతుంటుంది. ఇలా అప్పు తీర్చడంలోనే జీవితం గడిచిపోతుంది. మరి అలాంటివారు ఏం చేయాలి అన్న విషయాన్ని వస్తే..
వాస్తు శాస్త్ర ప్రకారం శనివారం రోజు ఉదయం, సాయంత్రం రావి చెట్టును పూజించాలట. దీంతోపాటు నాలుగు వైపులా నాలుగు దీపాలను వెలిగించి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలని ఇలా చేయడం వల్ల అప్పుల బాధల నుంచి నెమ్మదిగా ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. ఒకవేళ మీరు అప్పు తీర్చాలి అనుకుంటే మంగళవారం రోజు పవిత్రమైనదిగా పరిగణించాలని చెబుతున్నారు. మంగళవారం రోజున రుణాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తి త్వరగా అప్పుల నుంచి ఉపశమనాన్ని పొందవచ్చ.
వాస్తు ప్రకారం లక్ష్మీ దేవి, కుబేరుడి విగ్రహాన్ని ఇల్లు లేదా దుకాణంలో ఉత్తర దిశలో ఉంచాలి. తర్వాత ప్రతీ రోజూ క్రమం తప్పకుండా పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల ధనలాభం కలుగుతుందట. అలాగే అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఇల్లు లేదా దుకాణంలో ఉత్తరం వైపు డబ్బు పెట్టెను ఉంచడం చాలా మంచిదని చెబుతున్నారు. ఆగ్నేయ దిశలో లోపం వల్ల అప్పు తీర్చడం కష్టంగా మారుతుంది. ఈ దిశలో వంటగదిని ఏర్పాటు చేయకూడదు. అగ్నిమాపక, విద్యుత్ పరికరాలను ఇక్కడ ఉంచాలని చెబుతున్నారు..