Vastu Tips: ఏంటి.. ఈ ఒక్క పూల మొక్కను నాటితే కోటీశ్వరులు అవుతారా.. కాసుల వర్షం కురుస్తుందా?
Vastu Tips: ఇప్పుడు చెప్పబోయే ఈ పూల మొక్కను మన ఇంట్లో నాటుకుంటే అంతా మంచే జరుగుతుందని, డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:30 AM, Fri - 10 October 25

Vastu Tips: హిందూమతంలో వాస్తు శాస్త్రాన్ని చాలామంది పాటిస్తూ ఉంటారు. ఈ వాస్తు ప్రకారం గానే ఇంట్లో కొన్ని రకాల వస్తువులు అమర్చుకోవడంతోపాటు కొన్ని మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొక్క కూడా ఒకటి. ఈ పూల మొక్కను చాలామంది ఇంటి వద్ద ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. ఆ మొక్క మరేదో కాదు మందారం. మందారాన్ని సంపదకు దేవత అయిన లక్ష్మిదేవికి ఇష్టమైన పువ్వుగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మందార మొక్కను నాటడం చాలా శుభప్రదంగా చెబుతారు.
మరి ఇంట్లో మందార మొక్కను నాటితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ ఇంట్లో మందార మొక్కను నాటడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయట. ఇంట్లో వేర్వేరు ప్రదేశాలలో ఈ మొక్కను నాటడం వల్ల వేర్వేరు అర్థాలు ఉంటాయట. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మందార మొక్క ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని చెబుతున్నారు. ఎందుకంటే ఈ మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు మీ కుటుంబంతో ఉంటాయట. వాస్తు శాస్త్రం ప్రకారం మందార మొక్కను నాటడానికి ఉత్తర దిశ ఉత్తమమైన ప్రదేశంగా పరిగణించబడుతుందట.
మీ ప్రార్థన గదిలో మందార మొక్కను నాటడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు చేకూరుతాయట. మీ ఇంటి పూజా స్థలం దగ్గర మందార మొక్కను నాటడం వల్ల గృహ రుగ్మతలు త్వరగా తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే మందార మొక్క సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఇంట్లో దీన్ని నాటడం వల్ల ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుందట. ఇది ప్రతికూలతను దూరం చేయడానికి కూడా సహాయపడుతుందట. కాబట్టి, శుక్రవారాల్లో ఈ మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని, మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు.