Salt: ఉప్పుతో ఇలా చేస్తే చాలు.. లక్ష్మీదేవి మీ వెంటే?
మన వంటింట్లో దొరికే ఉప్పుతో మనం కొన్ని రకాల పరిహారాలను పాటించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
- By Anshu Published Date - 06:31 AM, Thu - 22 December 22

మన వంటింట్లో దొరికే ఉప్పుతో మనం కొన్ని రకాల పరిహారాలను పాటించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అంతేకాకుండా ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఏర్పడతాయి. వాస్తు దోషాలను అధిగమించడానికి ఉప్పును వివిధ మార్గాల్లో ఉపయోగించడం మంచిది. ఉప్పును పర్యావరణ శుద్ధి అని పిలుస్తారు. ఇది దాని శోషక లక్షణాల వల్ల మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. మరి ఉప్పుతో ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలసట, నిరాశ ,ప్రతికూల శక్తితో బాధపడుతున్నప్పుడు ఉప్పు నీటితో స్నానం చేయండి.
మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు వేసి తల స్నానం చేయడం వల్ల పునరుజ్జీవనం శక్తివంతంగా అనుభూతిని పొందుతారు. అదేవిధంగా కోరుకున్న ఫలితాలను పొందకపోతే ప్రతిరోజు ఉదయం చేతిలో కొంచెం ఉప్పుని తీసుకొని మీ తల చుట్టూ ఐదు నుండి ఏడు సార్లు చుట్టి ఆ తర్వాత ఆ ఉప్పుని నీటిలో వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ ఉప్పు ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఇంట్లో డబ్బు కొరత ఏర్పడినప్పుడు నైరుతి మూలలో ఒక గ్లాస్ ఉప్పు కలిపిన నీటిని ఉంచడం వల్ల డబ్బు పెరగడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కి డబ్బుకు కొరత ఉండదు.
అలాగే ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఇదిలో కొంచెం ఉప్పు వేసి ఇల్లు క్లీన్ చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగెటివిటీ ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇంట్లోని దుమ్ము లేదా ధూళి అన్ని వస్తువులు, కళాఖండాలు లేదా అలంకరణ వస్తువులను ఉప్పు నీటితో శుభ్రం చేయడం మంచిది. నీటిలో కొంచెం ఉప్పు వేసి వస్తువులను శుభ్రం చేయండి. ఇది ఇంట్లో సానుకూలతను పెంచుతుంది.ఇంటి నుండి ప్రతికూల శక్తిని వదిలించుకోవడానికి, మీ గదిలో కొంచెం ఉప్పుతో నీటిని ఉంచండి. ఈ ఉప్పు నీటిని క్రమం తప్పకుండా మార్చండి. ఈ నీటిని వాష్‌రూమ్,సింక్‌లో ఫ్లష్ చెయ్యాలి. ఆ నీటిని మీరు తాకకూడదు. ఈ గిన్నె మీ గది నుండి ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఉప్పు, రాతి ఉప్పు ఉపయోగించండి. కనిపించని మూలలో ఉంచండి. ఇది బాత్రూమ్ నుండి అన్ని ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. మీ బాత్రూంలో వాస్తు దోషాలు ఉన్నట్లయితే, ఉప్పును ఉపయోగించడం వల్ల ప్రతికూల ఫలితాలను తగ్గించవచ్చు.