HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Varalaxmi Vratham 2023 Date Time Puja Rituals And Significance

Varalaxmi Vratham 2023: వరలక్ష్మి వ్రతం ఏ సమయంలో చేస్తే మంచిది..?

హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం అంటే పండుగలు, వ్రతాల మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాని (Varalaxmi Vratham 2023)కి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

  • Author : Gopi Date : 25-08-2023 - 8:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Varalaxmi Vratham 2023
Lakshmi Devi

Varalaxmi Vratham 2023: హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం అంటే పండుగలు, వ్రతాల మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాని (Varalaxmi Vratham 2023)కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వరాలిచ్చే తల్లి వర మహాలక్ష్మీని ఎవరైతే భక్తి శ్రద్ధలతో తనను కొలుస్తారో వారందరి కోరికలను తీర్చే కల్పవల్లి. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు, నియమాలు, మడులు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసు, ఏకాగ్రత ఉండే భక్తితో ఈ వ్రతం చేస్తారో వారందరికీ శుభ యోగం కలిగి, అమ్మవారి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు మహిళలు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఇవాళ ఏ సమయంలో వ్రతం ప్రారంభించాలనే దానిపై పండితులు కొన్ని సూచనలు చేసారు. ఉదయం 9. 15 గంటలకు పూజలు ప్రారంభించవచ్చని సూచిస్తున్నారు. వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేచి తలస్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలనే ధరించాలి. ఆ తర్వాత ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని, పూజా గదిలో కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. పూజకు వాడే వస్త్రం కాటన్‌దే అయ్యుండాలి.

Also Read: Lakshmi Devi: లక్ష్మీదేవికి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం?

పూజ చేసేందుకు కలశాన్ని జాకెట్ పీస్‌తో అలంకరించాలి. అనంతరం పసుపు, కుంకుమ, గంధం కలిపిన మిశ్రమంతో స్వస్తిక్ చిహ్నం వేయాలి. కలశంలో బియ్యం లేదా నీరు, నాణేలు, ఐదు రకాల ఆకులతో పాటు తమలపాకులు నింపాలి. చివరగా మామిడాకులను కలశంపై ఉంచాలి. ఆ తర్వాత కొబ్బరికాయకు పసుపు రాసి దానిపై ఉంచాలి. అనంతరం అమ్మవారిని అలంకరించాలి. పూజలో భాగంగా ఐదు రకాల పండ్లు, నైవేద్యాన్ని సమర్పించాలి. వ్రతం నిర్వహించిన రోజున సాయంత్రం హారతి కూడా ఇవ్వాలి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • devotional news
  • Varalaxmi Vratham
  • Varalaxmi Vratham 2023

Related News

Why should a husband and wife stay apart during the month of Ashadha?

Ashada Masam 2026: ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు దూరంగా ఉండాలి?

హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఉండనుంది. ఈ మాసం రాగానే కొత్తగా పెళ్లైన దంపతులను ఒకరికొకరు దూరంగా ఉంచడం, వధువును పుట్టింటికి పంపించడం మన సమాజంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే దీని వెనుక కేవలం సెంటిమెంట్లు, నమ్మకాలు మాత్రమే కాకుండా పూర్వీకులు ఆలోచించిన అద్భుతమైన వైజ్ఞానిక, సామాజిక కారణాలు దాగి ఉన్న

  • Why is *Thamboolam* (betel leaves and areca nuts) offered? On what occasions is it given? What is its significance?

    Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd