Varalaxmi Vratham 2023: వరలక్ష్మి వ్రతం ఏ సమయంలో చేస్తే మంచిది..?
హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం అంటే పండుగలు, వ్రతాల మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాని (Varalaxmi Vratham 2023)కి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
- By Gopichand Published Date - 08:41 AM, Fri - 25 August 23

Varalaxmi Vratham 2023: హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం అంటే పండుగలు, వ్రతాల మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాని (Varalaxmi Vratham 2023)కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వరాలిచ్చే తల్లి వర మహాలక్ష్మీని ఎవరైతే భక్తి శ్రద్ధలతో తనను కొలుస్తారో వారందరి కోరికలను తీర్చే కల్పవల్లి. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు, నియమాలు, మడులు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసు, ఏకాగ్రత ఉండే భక్తితో ఈ వ్రతం చేస్తారో వారందరికీ శుభ యోగం కలిగి, అమ్మవారి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు మహిళలు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఇవాళ ఏ సమయంలో వ్రతం ప్రారంభించాలనే దానిపై పండితులు కొన్ని సూచనలు చేసారు. ఉదయం 9. 15 గంటలకు పూజలు ప్రారంభించవచ్చని సూచిస్తున్నారు. వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేచి తలస్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలనే ధరించాలి. ఆ తర్వాత ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని, పూజా గదిలో కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. పూజకు వాడే వస్త్రం కాటన్‌దే అయ్యుండాలి.
Also Read: Lakshmi Devi: లక్ష్మీదేవికి ఈ నైవేద్యాన్ని సమర్పిస్తే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం?
పూజ చేసేందుకు కలశాన్ని జాకెట్ పీస్‌తో అలంకరించాలి. అనంతరం పసుపు, కుంకుమ, గంధం కలిపిన మిశ్రమంతో స్వస్తిక్ చిహ్నం వేయాలి. కలశంలో బియ్యం లేదా నీరు, నాణేలు, ఐదు రకాల ఆకులతో పాటు తమలపాకులు నింపాలి. చివరగా మామిడాకులను కలశంపై ఉంచాలి. ఆ తర్వాత కొబ్బరికాయకు పసుపు రాసి దానిపై ఉంచాలి. అనంతరం అమ్మవారిని అలంకరించాలి. పూజలో భాగంగా ఐదు రకాల పండ్లు, నైవేద్యాన్ని సమర్పించాలి. వ్రతం నిర్వహించిన రోజున సాయంత్రం హారతి కూడా ఇవ్వాలి.