TTD : ఏప్రిల్‌లో తిరుమలకు వెళ్లానుకుంటున్నారా..? అయితే మీరు ఇది చూడాల్సిందే..
- By Sudheer Published Date - 03:53 PM, Tue - 23 January 24

ఏప్రిల్ (April ) నెలలో తిరుమల (Tirumala)కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి శుభవార్త తెలిపింది టీటీడీ (TTD). ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చేసింది టీటీడీ. అలాగే శ్రీవారి దర్శన టిక్కెట్లు, వసతి గదులు కోటా, సీనియర్ సిటిజన్లు/వికలాంగుల కోటా టికెట్లను విడుదల చేసింది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను జనవరి 24న అంటే రేపు ( జనవరి 24) ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనుంది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇకపోతే గురువారం రామకృష్ణ తీర్ద ముక్కోటి సందర్బంగా ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనుంది టీటీడి. జనవరి 25న పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ ఉంటుంది. దీంతో ఆరోజజు రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.
Read Also : Ayodhya Ram New Name : అయోధ్య రామయ్యకు కొత్త పేరు.. ఏమిటో తెలుసా?