Deepotsavams: నవంబర్ 20న టీటీడీ కార్తీక దిపోత్సవాలు: ఈవో ధర్మారెడ్డి
నవంబర్ 20 నుంచి వివిధ ప్రాంతాల్లో కార్తీక దీపోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.
- By Balu J Published Date - 12:01 PM, Wed - 1 November 23

Deepotsavams: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హిందూ సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నవంబర్ 20 నుంచి వివిధ ప్రాంతాల్లో కార్తీక దీపోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. కార్తీక దీపోత్సవాల ఏర్పాట్లపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. నవంబర్ 20న తిరుపతిలో, 27న కర్నూలులో, డిసెంబర్ 4న విశాఖలో దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.
స్థానిక యంత్రాంగం, పోలీసుల సమన్వయంతో ఆయా ప్రాంతాల దాతలను చేర్చుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే పూజ సామాగ్రి ఏర్పాట్ల కోసం తిరుమల ఆలయ ప్రధాన అర్చకుల సలహాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని అధికారులను ఈఓ ఆదేశించారు.
Also Read: Election Code: ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్, పోలీసులు ఎన్ని కోట్లు సీజ్ చేశారో తెలుసా