TTD : తిరుమలలో ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు.. వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ల రిలీజ్..
శ్రీవారి ఆలయం వద్ద శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లును టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy), ఈఓ ధర్మారెడ్డి విడుదల చేశారు.
- Author : News Desk
Date : 30-08-2023 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఈసారి అధికమాసం రావడంతో తిరుమల(Tirumla)లో శ్రీవారికి రెండు వార్షిక బ్రహ్మోత్సవాలు చేయనున్నారు. తాజాగా దీనిపై టీటీడీ(TTD) పాలకమండలి సమావేశం నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. శ్రీవారి ఆలయం వద్ద శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లును టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy), ఈఓ ధర్మారెడ్డి విడుదల చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. సెప్టెంబరు 18 నుంచి 26వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అలాగే అక్టోబర్ 14 నుంచి 22వ తేది వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నాం. సెప్టెంబరు 18వ తేదిన శ్రీవారికి సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేస్తాం. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన విధానాన్ని అమలు చేస్తాం. భక్తులకు వసతులు, భద్రతపై అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
Also Read : Posani Krishna Murali : నంది నాటకోత్సవాలపై పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్.. అవార్డుల ప్రకటన ఆ రోజే..