Tortoise Ring : తాబేలు ఉంగరంతో కలిగే ప్రయోజనాలు తెలుసా ?
Tortoise Ring : జ్యోతిష్య శాస్త్రంలో తాబేలు ఉంగరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే చాలామంది తాబేలు ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు.
- By pasha Published Date - 10:38 AM, Mon - 20 November 23

Tortoise Ring : జ్యోతిష్య శాస్త్రంలో తాబేలు ఉంగరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే చాలామంది తాబేలు ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఉంగరాన్ని ధరించడం శుభప్రదంగా కూడా పరిగణిస్తారు. తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడడంతో పాటు జీవితంలో ఎదురయ్యే కష్టాలు అడ్డంకులు కూడా దూరం అవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. తరచూ ఒకదాని తర్వాత ఒకటి సమస్యలతో బాధపడేవారు తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల మంచి మంచి ఫలితాలు కనిపిస్తాయి. తాబేలు ఉంగరం ధరించడం మంచిదే కానీ ఉంగరాన్ని ధరించే వారు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
We’re now on WhatsApp. Click to Join.
మరి ఈ తాబేలు ఉంగరాన్ని ధరించినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ఉంగరాన్ని కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే ధరించాలి. తాబేలు ఉంగరాన్ని ధరించే ముందు కొన్ని గంటల పాటు పాల, నీటిలో ఉంగరాన్ని ఉంచాలి. ఆ తర్వాత ఆ ఉంగరాన్ని శుద్ధి చేసి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. తాబేలు ఉంగరాన్ని శుద్ధి చేసిన తర్వాత మీ ఇంట్లో ఉండే లక్ష్మిదేవి ముందు ఈ ఉంగరాన్ని ఉంచి ప్రత్యేక పూజలు చేసి, తర్వాత లక్ష్మిదేవి మంత్రాన్ని చదివి ఈ ఉంగరాన్ని ధరించాలి. అయితే ఈ ఉంగరాన్ని గురువారం లేదంటే శుక్రవారం ధరించడం వల్ల మంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
చేతి మొదటి వేలు లేదా మధ్య వేలులో..
అలాగే ఈ తాబేలు ఉంగరాన్ని చేతి మొదటి వేలు లేదా మధ్య వేలులో ధరించాలి. అదేవిధంగా తాబేలు ఉంగరాన్ని ధరించినప్పుడు తాబేలు ముఖం మీవైపు ఉండేలా ధరించాలి. వెండితో లేదా పంచలోహంతో తయారు చేసిన దానిని ధరించడం చాలా శుభప్రదం. తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. అయితే తాబేలు ఉంగరాన్ని ధరించాలి అనుకున్న వారు గురువారం రోజు లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించి ఆ తర్వాత శుక్రవారం రోజు ఆ ఉంగరాన్ని ధరించడం వల్ల మంచి మంచి ఫలితాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ ఉంగరాన్ని ధరించే రోజు తప్పకుండా లక్ష్మిదేవికి పూజ చేసి ఉపవాసం చేయాలి.
Also Read: World Cup 2023 : కోహ్లీని ఓదార్చిన అనుష్క శర్మ..
Related News

Vamana Jayanti 2023: వామన జయంతి విశిష్టత
వామన్ ద్వాదశి భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని పన్నెండవ రోజున జరుపుకుంటారు. ఈ రోజున ప్రధానంగా విష్ణువు అవతారమైన వామనుడిని పూజిస్తారు.