Tholi Ekadashi 2024: తొలి ఏకాదశి రోజు ఈ పనులు చేస్తే చాలు పెళ్లి యోగంతో పాటు ఎన్నో లాభాలు!
ఆషాడ మాసంలో వచ్చే మొదటి ఏకాదశినే తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని చెబుతూ ఉంటారు. ఇక ఈ తొలి ఏకాదశి రోజున చాలామంది ఉపవాసాలు ఉండి ప్రత్యేకంగా దేవుళ్లకు పూజలు కూడా చేస్తూ ఉంటారు.
- By Anshu Published Date - 01:11 PM, Tue - 16 July 24

ఆషాడ మాసంలో వచ్చే మొదటి ఏకాదశినే తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని చెబుతూ ఉంటారు. ఇక ఈ తొలి ఏకాదశి రోజున చాలామంది ఉపవాసాలు ఉండి ప్రత్యేకంగా దేవుళ్లకు పూజలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలు పూజ పరిహారాలు పాటించిన ఫలితాన్ని ఇస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కాగా ఈ తొలి ఏకాదశి రోజున సూర్యోదయాన్ని కంటే ముందే నిద్ర లేవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేయాలి. అనంతరం దేవుడి గదిని శుభ్రం చేసి పాలు పండ్లు రెడీగా పెట్టుకోవాలి.
పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. అయితే విష్ణు అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకు అనేక రకాల పూలు, పండ్లు సమర్పించడం మంచిది. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారి కోరికలు తప్పకుండా నెరవేరతాయని చెబుతున్నారు పండితులు. వివాహం కాని వారు తొలి ఏకాదశి రోజున రుక్మిణి కల్యాణంలో 11 సార్లు చదివితే నెల రోజులు కూడా తిరక్కుండానే పెళ్లి సెటిల్ అవుతుందని చెబుతున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా కూడా మనకున్న దోషాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి పొందవచ్చును చెబుతున్నారు. తొలి ఏకాదశి రోజు నా పేదలకు దానధర్మాలు చేయడం మంచిదట.
వస్త్ర దానం ఆహార దానం, డబ్బు దానం ఇలా ఎవరికి తోచిన విధంగా వారికి పేదలకు అవసరమైన వాటిని సహాయం చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. ఏకాదశి రోజున నెమలి ఫించంను ఇంటికి తీసుకొచ్చి పూజించుకొవాలి. లాకర్ లో పెట్టుకుంటే డబ్బులకు ఎన్నటికి కూడా లోటు ఉండదట. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున గోశాలకు వెళ్లి అక్కడ ఆవులకు గ్రాసంలో వేయాలట. రోడ్డుపై సంచరించే ఆవులు కుక్కలు వంటి మూగజీవాలకు ఏదైనా తినడానికి ఆహారం పెట్టడం మంచిది అంటున్నారు పండితులు. పైన చెప్పిన పనులు చేయడం వల్ల వివాహం కానీ వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయట. అలాగే కష్టాల నుంచి విముక్తి కూడా పొందుతారు అంటున్నారు పండితులు.