Lord Shani: శని దేవుడి ఆగ్రహం తగ్గాలంటే ఈ ఒక్క పువ్వును సమర్పించాల్సిందే?
హిందూమతంలో శనీశ్వరుడిని న్యాయదేవుడిగా పిలుస్తారు. మనం చేసే మంచి చెడు పనులను బట్టి మనకు మంచి చెడు ఫలితాలను అందిస్తాడు. ఆయన అనుగ్రహం
- By Anshu Published Date - 01:00 PM, Thu - 1 February 24

హిందూమతంలో శనీశ్వరుడిని న్యాయదేవుడిగా పిలుస్తారు. మనం చేసే మంచి చెడు పనులను బట్టి మనకు మంచి చెడు ఫలితాలను అందిస్తాడు. ఆయన అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంత బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వడం ఖాయం. అలాగే ఆయన ఆగ్రహిస్తే మాత్రం పరిస్థితులు ఒక్కసారిగా తారుమారవుతాయి. రాత్రికి రాత్రి కోటీశ్వరులు బీదవారిగా మారిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. నవ గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా శని. అలాంటి శని దేవుడి దయ ఉండాలంటే ఆయనను ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆయనను నిష్టగా, ఆయనకు నచ్చినట్టు పూజించాలి.
శని దేవుడి ఆశీర్వాదం పొందటానికి శనివారం నాడు నియమ నిష్టలతో పూజలు చెయ్యాలి. శనివారం నాడు నల్లని వస్త్రాలు ధరిస్తే కూడా శని దేవుడు ప్రసన్నం అవుతాడు. ప్రతీ వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో శని గ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే శని ప్రభావం తగ్గాలంటే, శని దేవుడి ప్రసన్నం కావాలంటే ఆయనకు పూజలు చేసే సమయంలో మాత్రం నియమ నిష్టలను పాటించాలి. శని పూజకు నీలం రంగు పూలను ఉపయోగించాలి. నీలం రంగు శంఖం పూలు శని దేవుడికి చాలా ఇష్టం. శని దేవుడికి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తర్వాత పూజలు చెయ్యటం ఉత్తమమైన సమయం. నీలి రంగు అపరాజిత పుష్పాలు శని దేవుడికి ఇష్టమైన పూలు కావటంతో ఆ పూలతో శని దేవుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
అపరాజిత పూలను సమర్పిస్తే శని దేవుడు సంతోషిస్తాడు. శనివారం నాడు శని దేవుడి ముందు ఆవనూనె దీపాలు వెలిగించాలి. శని దేవుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించటం వల్ల శని ప్రసన్నం అవుతాడు. శనిదేవుని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా శని విగ్రహాన్ని తాకకూడదు. ఆయన కరుణ ఉంటె జీవితంలో అన్నీ ఆనందాలు దక్కుతాయి. శని తలచుకుంటే కనక వర్షం కూడా కురుస్తుంది. శని మన జీవితాన్ని క్రమబద్ధంగా ఉండేలా చేసే దేవుడు, ఆయన క్రమశిక్షణకు మారుపేరు.