Monday: మీ కోరిక వెంటనే నెరవేరాలా.. అయితే సోమవారం రోజు ఈ పరిహారం పాటించాల్సిందే!
Monday: మీరు కోరిన కోరిక నెరవేరాలి అంటే సోమవారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే చాలు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందని చెబుతున్నారు పండితులు. మరి అందుకోసం సోమవారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Wed - 12 November 25
Monday: మామూలుగా ఇంట్లో అలాగే ఆలయాలకు వెళ్లి పూజ చేసినప్పుడు దేవుడిని కోరికలు తీర్చమని వేడుకుంటూ ఉంటారు. ఇందుకోసం అనేక రకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఏమి చేసిన, ఎన్ని పరిహారాలు పాటించిన కూడా కొన్నిసార్లు కోరిన ఎన్ని పరిహారాలు పాటించిన కూడా కొన్నిసార్లు కోరిన కోరికలు నెరవేరవు. అయితే మీరు కోరిన కోరిక తక్షణమే నెరవేరాలి అంటే సోమవారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వారంలో సోమవారం రోజు పరమేశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ రోజున పరమేశ్వరుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే వాటితో పాటుగా సోమవారం రోజు ఇప్పుడు చెప్పే శక్తివంతమైన పరిహారం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. మన ఇంట్లోనే పూజ గదిలో పరమేశ్వరుడి విగ్రహం లేదా ఫోటో ముందు రెండు లవంగాలను, కొద్దిగా కర్పూరాన్ని ఉంచాలట. తర్వాత “ఓం నమః శ్శివాయ” అనే బీజాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పాటించాలని చెబుతున్నారు.
ఇలా 108 సార్లు ఆ మంత్రాన్ని జపించిన తరువాత కర్పూరం లవంగం రెండూ కుడి చేతిలో పట్టుకుని మీరు కోరిన కోరికను స్పష్టంగా ఆ పరమేశ్వరుడికి తెలియజేయాలట. తర్వాత లవంగాలను కర్పూరాన్ని కలిపి ఒక ప్రమిదలో వేసి వెలిగించాలట. ఈ విధమైన పరిహారం పాటించడం వల్ల ఆ శివానుగ్రహం కలిగి మీరు కోరిన కోరిక నెరవేరుతుందని చెబుతున్నారు పండితులు.