Dhana Trayodashi : ధన త్రయోదశి రోజు ఈ 8 వస్తువులు కొనొద్దు
Dhana Trayodashi : ఇవాళ ధన త్రయోదశి. ఐదురోజుల దీపావళి పండుగలో మొదటి రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటారు.
- By Pasha Published Date - 08:21 AM, Fri - 10 November 23

Dhana Trayodashi : ఇవాళ ధన త్రయోదశి. ఐదురోజుల దీపావళి పండుగలో మొదటి రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటారు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలుకుతుంటే.. ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందని నమ్ముతారు. . అందుకే ఈ రోజు లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ఈ రోజున బంగారం, వెండి, పాత్రలు, వివిధ ఆభరణాలు, ఆస్తులు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ రోజు కొనుగోలు చేయకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
- ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయకపోయినా పర్వాలేదు కానీ.. వన్ గ్రామ్ గోల్డ్ కొనుగోలు చేయొద్దని పండితులు చెబుతున్నారు.
- ఈరోజు ఇనుము, స్టీలు, ప్లాస్టిక్, అల్యూమినియం తప్ప వేరే రకం పాత్రలు కొనొచ్చు. అయితే వాటిని ఏవైనా గింజలు లేదా నీటితో నింపి ఇంట్లోకి తీసుకురావాలి.
- ఇనుము శనికి చిహ్నం. అందుకే ఈరోజున ఇనుము వస్తువులను కొనరు.
- స్టీల్ పాత్రలు కూడా కొనొద్దు. వాటికి బదులుగా రాగి పాత్రలు కొనొచ్చు.
- గాజు వస్తువులు రాహువుకు సంబంధించినవి. ధన త్రయోదశి రోజున వాటిని కొనొద్దు.
- ఈరోజు అల్యూమినియం, ప్లాస్టిక్ వస్తువులను కొనొద్దు.
- ఈరోజు పదునైన వస్తువులను కొనొద్దు.
- ఈరోజు నూనె, నెయ్యి అస్సలు(Dhana Trayodashi) కొనొద్దు.
Also Read: Dhana Trayodashi : ఇవాళ ధన్‌తేరస్.. తిథి, పూజా ముహూర్తం వివరాలివీ
గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.