Kedarnath : కేదారనాథ్‌లో ఏదో ఉంది… అంతుపట్టని రహస్యం..ఎవరు నిర్మించారు? ఎప్పుడు?..!
ఈ గుడి నిర్మాణం గురించి స్పష్టమైన చరిత్ర లేకపోయినా 8వ శతాబ్దం నాటిదని అంటారు. అంటే 1200 ఏళ్ల నాటిదైన ఈ ఆలయం వాతావరణం, ప్రకృతి విపత్తులకు ఎటువంటి భయమూ లేకుండా నిలిచిపోయింది. ఈ రోజునాటికీ ఎవరు నిర్మించారో, ఎలా నిర్మించారో అన్న ప్రశ్నలకి సమాధానాలు లేవు.
- By Latha Suma Published Date - 12:05 PM, Fri - 15 August 25

Kedarnath : హిమాయాల్లో తూర్పు సంధ్యకిరణాల్లో మెరిసే పవిత్ర కేదారనాథ్ ఆలయం.. భారతీయ పురాతన నిర్మాణ విజ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యం. అది ఒక దేవాలయం మాత్రమే కాదు ఒక అంతుచిక్కని మిస్టరీ. ఒక రహస్యం! ఎందుకంటే ఈ ఆలయం కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదు..అది కాలాన్ని లెక్కించని ఆధ్యాత్మిక శక్తి.
ఎవరు నిర్మించారు? ఎప్పుడు?
ఈ గుడి నిర్మాణం గురించి స్పష్టమైన చరిత్ర లేకపోయినా 8వ శతాబ్దం నాటిదని అంటారు. అంటే 1200 ఏళ్ల నాటిదైన ఈ ఆలయం వాతావరణం, ప్రకృతి విపత్తులకు ఎటువంటి భయమూ లేకుండా నిలిచిపోయింది. ఈ రోజునాటికీ ఎవరు నిర్మించారో, ఎలా నిర్మించారో అన్న ప్రశ్నలకి సమాధానాలు లేవు.
ప్రతికూల భౌగోళిక స్థలంలో నిర్మాణం!
ఈ గుడి స్థలం పట్లే అనేక అనుమానాలు ఉన్నాయి. ఒకవైపు 22,000 అడుగుల ఎత్తు గల కేదారన్ కొండ, మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్‌కుండ్, మూడో వైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్‌కుండ్. మధ్యలో ఐదు పవిత్ర నదుల ప్రవాహం మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి, స్వరందరి. ఇంతటి దుర్భేద్యమైన ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు అక్కడే ఆలయం నిర్మించారు? ఈ ప్రశ్నలకి సరైన సమాధానం లేదు.
అత్యంత క్లైమాటిక్ కండీషన్ల మధ్య ఉన్న గుడి
చలికాలంలో ఎడారి మంచు వర్షాకాలంలో విపరీతమైన వరదలు. 2013లో ముంచుకొచ్చిన విపత్కర వరదల దెబ్బకు పరిసర గ్రామాలు నేలమట్టం అయ్యాయి. వర్షపాతం సగటుతో పోల్చితే 375% ఎక్కువగా నమోదైంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయినా ఈ ఆలయం మాత్రం నిలిచిపోయింది! ఒక్క రాయి కూడా కదలలేదు. ఇదే కేదారనాథ్ మహిమ.
భీమశిల అడ్డుపడిన కథ… యాదృచ్ఛికమా?
అది అదృష్టమా? లేక దేవుడి లీలా? 2013 వరదల్లో, ఓ భారీ శిలా గుడి వెనుకకు వచ్చి నిలవడంతో, వరద ప్రవాహం ఆలయాన్ని తాకకుండా రెండు వైపులా విడిపోయింది. అది లేకపోయి ఉంటే గుడికి గట్టి నష్టం జరిగేది. ఈ సంఘటన కేదారనాథ్ ఆలయంలో ఏదో అపార శక్తి ఉందని నమ్మించేలా చేస్తుంది.
అద్భుత నిర్మాణ శైలి — ఉత్తరం-దక్షిణ దిక్కు!
దేశంలోని దేవాలయాల్లో చాలా తూర్పు–పశ్చిమ దిశలో నిర్మించబడ్డాయి. కానీ కేదారనాథ్ ఆలయం మాత్రం ఉత్తరం–దక్షిణ దిశలో ఉంది. ఇది సాధారణమైన విషయం కాదు. దీనికెంతో గాఢమైన వాస్తు ఆధారాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా కాకుండా సాధారణ నిర్మాణ రీతిలో నిర్మించి ఉంటే, అది ఈ వరదలని తట్టుకోలేదేమో!
రాళ్లు ఎక్కడి నుంచో ఎందుకు?
ఈ గుడికి ఉపయోగించిన రాళ్లు ఆ ప్రాంతంలో లభించవు. అవి ఎక్కడి నుంచో తెచ్చారు. ఆ సమయంలో ట్రాన్స్‌పోర్ట్, మెషినరీలు లేని కాలంలో ఆ రాళ్లను అక్కడికి ఎలా తరలించారు అన్నదీ మరో మిస్టరీ. పైగా, వాటిని కలపడానికి సిమెంట్ వాడలేదు. సాధారణ శిలా గుడులలా కాకుండా, ప్రత్యేకమైన ‘ఆష్టర్’ నిర్మాణ పద్ధతిని వాడినట్టు చెబుతారు.
మంచు కప్పిన గుడి — శతాబ్దాల మౌనం
లిగ్నోమాటిక్ డేటింగ్ ప్రకారం 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్య కాలం వరకు ఈ ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేదట. అయినా, ఆలయం లోపల ఎలాంటి బీటలు లేకుండా, శిల్పాలు చెక్కు చెదరకుండా ఉంటే అది సాధారణం కాదు. ఒక అద్భుత నిర్మాణ విజ్ఞానమే.
ఇదేనా భగవత్ చైతన్యం?
ఈ ఆలయం కేవలం రాళ్ల కలయిక కాదు… అది ఒక శక్తి కేంద్రమా? ఒక దివ్య ప్రదేశమా? అన్న సందేహం కలుగుతుంది. ఎందుకంటే, ఇది మానవ శక్తిని మించిపోయిన ఒక అపూర్వ నిర్మాణం. అందుకే అంటారు కేదారనాథ్‌లో ఏదో ఉంది మనం చూడలేని, మనం నమ్మలేని శక్తి!