HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Devotional
  • ⁄The Khara Masam Has Started What Should We Do What Needs To Be Done When Will The Auspicious Times Come Again

Khara Masam: ఖర మాసం మొదలైంది.. ఏం చేయాలి.. ఏం చేయొద్దు.. మళ్లీ శుభ ముహూర్తాలు ఎప్పుడు?

ఖర మాసం మొదలైంది. హిందూ క్యాలెండర్‌ ప్రకారం.. మార్చి 15న ఉదయం 5:17 గంటలకు ఖర మాసం స్టార్ట్ అయింది. ఈ సమయంలో సూర్యుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు.

  • By Vamsi Korata Published Date - 06:30 AM, Fri - 17 March 23
Khara Masam: ఖర మాసం మొదలైంది.. ఏం చేయాలి.. ఏం చేయొద్దు.. మళ్లీ శుభ ముహూర్తాలు ఎప్పుడు?

ఖర మాసం (Khara Masam) మొదలైంది. హిందూ క్యాలెండర్‌ ప్రకారం.. మార్చి 15న ఉదయం 5:17 గంటలకు ఖర మాసం స్టార్ట్ అయింది. ఈ సమయంలో సూర్యుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఖర మాసం ఏప్రిల్ 14 వరకు ఉంటుంది.ఈ సమయంలో అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఖర మాసంలో సూర్యుడు మీనం లేదా ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు.. శుభ రాశుల మీద, యోగం మీద, శుభ కార్యాలపై అశుభ ప్రభావం చూపుతుంది. పెళ్లి, ముహూర్తం లాంటి ముఖ్యమైన పనులు కూడా చేయకూడదు. ఇలా చేయడం వల్ల కొత్తగా పెళ్లయిన జంట జీవితంలో కష్టాలు తప్పవు.

ఇదొక్కటే కాదు.. కొత్త వాహనం, ఇల్లు లేదా మరేదైనా ఆస్తిని ఖర మాసంలో (Khara Masam) కొనొద్దు.మీరు కొత్త ఉద్యోగం గురించి ఆలోచిస్తుంటే, ఈ సమయంలో ట్రై చేయకండి.  లేకుంటే మున్ముందు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఖర మాసంలో శుభ కార్యాలు జరగవు. గృహ ప్రవేశం, ఉపనయనం, ముండనం, నిశ్చితార్థం కూడా చేయకూడదు.  వాటి కోసం ఖర మాసం ముగిసిన తర్వాత సమయాన్ని ఎంచుకోండి. ఈ మాసంలో భగవంతుని పూజకు విశేష ప్రాధాన్యత ఉంటుంది.

ఈ సమయంలో సూర్య భగవానుని పూజిస్తారు. దీనివల్ల అదృష్టాన్ని మరియు సంపదలను పొందొచ్చు.  ఈ మాసంలో ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. కుంకుడు, పసుపు పువ్వులు, అక్షతలను సమర్పించండి. ఖర మాసంలో శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి.  ఖర మాసంలో తులసిని పూజించడం వల్ల ఐశ్వర్యం, ధన ధాన్యాలు , ఆరోగ్యం లభిస్తాయి.

మే 2 నుంచి శుభ కార్యాలు ప్రారంభం.. ఎందుకంటే..

జ్యోతిశ్య నిపుణుల ప్రకారం.. సూర్యుడు.. ధనుస్సు మరియు మీన రాశులలోకి ప్రవేశించినప్పుడు సంవత్సరానికి రెండుసార్లు ఖర మాసాలు వస్తాయి. సూర్యుడు ఈ రాశిలో ఒక నెలపాటు ఉంటాడు.  మీనరాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో.. గురు గ్రహం యొక్క ప్రకాశం కూడా బలహీనంగా మారుతుంది. ఈ టైంలో బృహస్పతి స్వభావంలో ఉగ్రత ఉంటుంది.

ఏదైనా శుభ కార్యం చేయాలంటే త్రిబలం అవసరం. త్రిబలం అంటే.. సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి యొక్క శక్తి. ఎప్పుడైతే మూడు గ్రహాలు ఉత్తమ స్థానంలో ఉంటాయో.. అప్పుడే శుభ కార్యాలు జరుగుతాయి. వీటిలో ఏదైనా ఒకటి బలహీనంగా ఉన్నా శుభకార్యం జరగదు. అయితే ఈసారి శుభ ముహూర్తం కోసం మే 2 వరకు వేచి ఉండాలి. ఏప్రిల్ 29 వరకు బృహస్పతి అస్తమిస్తుంది. బృహస్పతి బాల్య దోషం మూడు రోజులు ఉంటుంది. అందుకే మే 2 నుంచి అన్ని శుభ కార్యాలు ప్రారంభం కానున్నాయి.

Also Read:  Lord Ganesha: కలలో వినాయకుడి కనిపిస్తున్నాడా.. దేనికి సంకేతమో తెలుసా?

Telegram Channel

Tags  

  • auspicious
  • Come Again
  • devotional
  • Done
  • god
  • Khara Masam
  • Lord
  • Need
  • Started
  • time
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

April 6 to May 2: వృషభ రాశిలో శుక్రుడి సంచారం.. 6 రాశుల వారిపై కనక వర్షం

April 6 to May 2: వృషభ రాశిలో శుక్రుడి సంచారం.. 6 రాశుల వారిపై కనక వర్షం

వృషభ రాశిలో శుక్రుడి సంచారం ఏప్రిల్ 6 నుంచి మే 2 వరకు ఉంటుంది. ఈ టైంలో 6 రాశుల వారిపై ధన వర్షం కురుస్తుంది. ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది.

  • Cash: ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఈ పరిహారాలు పాటించాల్సిందే?

    Cash: ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఈ పరిహారాలు పాటించాల్సిందే?

  • Ugadi Horoscope 2023: ఈ కొత్త సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి ఫలితాలు వస్తాయి?

    Ugadi Horoscope 2023: ఈ కొత్త సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి ఫలితాలు వస్తాయి?

  • Planets Parade: విశ్వ వీధిలో ఒకే వరుసలో 5 గ్రహాల కవాతు.. ఎందుకు..? ఎలా..?

    Planets Parade: విశ్వ వీధిలో ఒకే వరుసలో 5 గ్రహాల కవాతు.. ఎందుకు..? ఎలా..?

  • Sri Ram Navami is Coming: రామజన్మ భూమిలోని రాముడి ఆలయానికి సంబంధించిన వివరాలివీ

    Sri Ram Navami is Coming: రామజన్మ భూమిలోని రాముడి ఆలయానికి సంబంధించిన వివరాలివీ

Latest News

  • Hero Father Passed Away: స్టార్ హీరో తండ్రి కన్నుమూత

  • Gold Price Today: మహిళలకు కన్నీళ్లు పెట్టిస్తున్న బంగారం ధరలు..!

  • Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!

  • Putin Arrest Warrant: పుతిన్‌ను అరెస్ట్ చేస్తే యుద్ధం తప్పదు.. వార్నింగ్ ఇచ్చిన రష్యా మాజీ అధ్యక్షుడు

  • Anuradha @ TDP: చంద్రబాబు సంచలనాల్లో అనురాధ ఎపిసోడ్

Trending

    • CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: