Swastik: ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఇంటి ప్రధాన ముఖ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఇది అనేక సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:32 PM, Wed - 12 March 25

హిందూ మతంలో స్వస్తిక్ కు చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ స్వస్తిక్ గుర్తుని చాలా సందర్భాలలో అనేక శుభ కార్యాల సమయంలో ఈ గుర్తును వేస్తూ ఉంటారు. నిజానికి ఈ స్వస్తిక్ ప్రాధాన్యతను గ్రంథాలలో ప్రస్తావిస్తూ ఉంటారు. నిరంతరం ఏదైనా సమస్యతో పోరాడుతుంటే లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అనిపిస్తే దానిని తొలగించడానికి సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారాన్ని అవలంబించవచ్చని చెబుతున్నారు పండితులు. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఏర్పాటు చేయడం అదృష్టానికి చిహ్నం అంటున్నారు.
ఇంతకీ ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ చిహ్నం ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రధాన ద్వారం మీద స్వస్తికను ఏర్పాటు చేయడానికి దాని మెటీరియల్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. అయితే ఈ స్వస్తిక్ గుర్తు వేయడానికి ఎరుపు రంగు సిందూరాన్ని మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు. ఎందుకంటే ఇది శుభం, శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుందట. ఎరుపు రంగు సానుకూలత, శ్రేయస్సును ఆకర్షిస్తుందట. దీనితో పాటుగా తొమ్మిది వేళ్ల పొడవు, వెడల్పు గల స్వస్తికను తయారు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు పండితులు.
ఎందుకంటే ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుందట. అలాగే వాస్తు దోషాలను తొలగిస్తుందని చెబుతున్నారు. కాగా ఈ గుర్తు వేసేటప్పుడు పరిశుభ్రత పాటించాలట. ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ తయారు చేసిన తర్వాత, ఆ స్థలాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలట. ధూళి కూడా పేరుకుపోనివ్వవద్దని ఎందుకంటే అది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని చెబుతున్నారు. స్వస్తిక్ తయారు చేసిన చోట బూట్లు, చెప్పులు ఉంచకూడదట. ఇది సానుకూల శక్తిని అడ్డుకుంటుందట. ప్రధాన ద్వారం కాకుండా, ఇంటి ప్రాంగణం మధ్యలో కూడా స్వస్తిక్ ను తయారు చేయవచ్చట. ఇది మొత్తం ఇంటిలో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుందని చెబుతున్నారు. కాగా స్వస్తిక్ తయారు చేసేటప్పుడు, ఎరుపు రంగు వస్త్రం లేదా పసుపు, కుంకుమను మాత్రమే వాడాలట. ఇతర రంగులను అస్సలు ఉపయోగించకూడదట. ఈ గుర్తు ఇంట్లో శాంతి, శ్రేయస్సు, సానుకూల శక్తిని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుందట. సరైన రీతిలో తయారు చేయడం వల్ల, ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, శుభప్రదంగా మార్చవచ్చని చెబుతున్నారు.