Dreams: కలలో శ్మశానవాటిక లేదా అంత్యక్రియల ఊరేగింపు చూడటం శుభమా..? అశుభమా..? దేనికి సంకేతమో తెలుసా..?
కలలు కనడం మానవ సహజం. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికీ కలలు వస్తుంటాయి.
- By News Desk Published Date - 09:18 PM, Tue - 22 April 25

Dreams: కలలు కనడం మానవ సహజం. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికీ కలలు వస్తుంటాయి. మానసిక స్థితికి ప్రతిరూపాలే కలలు. పడుకోనేటప్పుడు సంతోషంగా ఉంటే ఒకలాగా.. విషాధంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు మరొక విధంగా ఉంటాయి. కలలు వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు కన్పిస్తాయి. కలలో ఎటువంటి దృశ్యాలు కనపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాలను కలల శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే, వాటిని కొందరు నమ్ముతారు.. మరికొందరు నమ్మరు. కలల శాస్త్రం ప్రకారం.. కలలో శ్మశాన వాటిక లేదా అంతిమయాత్ర కనిపించినప్పుడు మంచి జరుగుతుందా..? చెడు జరుగుతుందా అనే విషయాన్ని తెలుసుకుందాం.
Also Read: Singer Pravasthi Issue : ప్రవస్తి ఆరోపణల పై సింగర్ సునీత ఏమంటుందంటే !!
కలల శాస్త్రం ప్రకారం.. కలలో దహన సంస్కారాల స్థలాన్ని లేదా అంత్యక్రియల ఊరేగింపును చూడటం వెనుక అనేక అర్ధాలు దాగిఉన్నాయి. కలలో దహన సంస్కార స్థలాన్ని చూడటం శుభ సంకేతం. ఇది జీవితంలో ముందుకు సాగడానికి, పురోగతి సాధించడానికి సంకేతం. దీని అర్ధం.. మీ ఇంటి నుంచి దుఃఖం, పేదరికం తొలగిపోయి ఆనందం, శ్రేయస్సు రాబోతున్నాయని సంకేతాలు.
Also Read: US family policies: చైనా బాటలో అమెరికా.. పిల్లలను కనేవారికి ప్రత్యేక రాయితీలు.. అవేమిటంటే?
మీరు కలలో అంత్యక్రియల ఊరేగింపును చూసినట్లయితే శుభసూచకం. మీకు ఇన్నాళ్లు నెరవేరని కోరికల్లో కొంత భాగం నెరవేరుతాయి. అదేవిధంగా మీరు శ్మశాన వాటికకు వెళ్తున్నట్లు కలలో కనిపిస్తే.. మీరు ఎదుర్కొంటున్న ఏదైనా పెద్ద సమస్య త్వరలోనే తొలగిపోతుందని అర్ధం. మీరు కలలో అంత్యక్రియల ఊరేగింపు లేదా బీరువా చూడటం కూడా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభానికి లేదా ఏదైనా ముఖ్యమైన మార్పునకు సంకేతంగా భావించాలి. మీరు కొత్త పనిని త్వరలోనే ప్రారంభిస్తారు.. లేదా, ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో పురోగతిని సాధించేందుకు మీకు మంచి అవకాశం లభిస్తుందని అర్ధం.
ముఖ్య గమనిక: ఈ కథనంలో ప్రచురించిన అంశాలు పూర్తిగా నిర్ధారణ కాదు. కేవలం కొన్ని అంశాల ఆధారంగా పరిగణలోకి తీసుకొని రాసినవే.