Vastu Tips For Sleeping: పడుకునేటప్పుడు ఈ వస్తువులు ఉంటే గ్రహ దోషం.. ఇలా నిద్ర పోకూడదు
రాత్రి పడుకునే ముందు భగవత్ గీత లాంటి పవిత్ర గ్రంధాలను తల పక్కన పెట్టి పడుకోవాలి. ఇలా చేస్తే పీడకలలు దరిచేరవు. అవకాశం ఉంటె సువాసన వెదజల్లే పువ్వులను మంచం దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
- By Praveen Aluthuru Published Date - 02:31 PM, Sat - 13 April 24

Vastu Tips For Sleeping: రాత్రి పడుకునే ముందు భగవత్ గీత లాంటి పవిత్ర గ్రంధాలను తల పక్కన పెట్టి పడుకోవాలి. ఇలా చేస్తే పీడకలలు దరిచేరవు. అవకాశం ఉంటె సువాసన వెదజల్లే పువ్వులను మంచం దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా ప్రశాంతంగా నిద్రపోవచ్చు.భయానక కలలు రాకుండా ఉండాలంటే తాళం వంటి ఏదైనా ఇనుప వస్తువును మంచం దగ్గర పెట్టుకోవడం ద్వారా రాహువు మరియు కేతువుల చెడు ప్రభావాలను దూరం చేస్తుంది. ఏలకులు లేదా లవంగాలు కాగితంలో చుట్టి మంచం పక్కన పెట్టుకోవడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయి. పడుకునే ముందు రాగి పాత్రలో నీటిని నింపాలి. ఉదయం నిద్రలేవగానే ఈ నీళ్లతో ముఖం కడుక్కోవాలి.. ఆ తర్వాత ఎవరూ ..అడుగు పెట్టని చోట ఆ నీటిని పోయాలి. ఈ పరిహారంతో సూర్యుడు బలపడతాడు. అలాగే అందం కూడా రెట్టింపవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
We’re now on WhatsApp. Click to Join
ఇలా అస్సలు నిద్ర పోకూడదు…ఆయుష్షు తగ్గిపోతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు మన పాదాలను ఉత్తరం లేదా దక్షిణం వైపు పెట్టి అస్సలు నిద్రించకూడదు .ఎందుకంటే లక్ష్మీదేవి మరియు కుబేరుడు ఉత్తరాన నివసిస్తారు మరియు పూర్వీకులు దక్షిణాన ఉంటారు. అలా నిద్రిస్తే ఆర్థిక నష్టంతో పాటు అనారోగ్యపరమైన సమస్యలు తప్పవని శాస్త్రం చెప్తుంది. జీవితకాలం తగ్గిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉత్తరం లేదా దక్షిణం వైపు తల పెట్టి నిద్రించవచ్చు. ఇలా నిద్రిస్తే ఆయుష్యు పెరుగుతుంది. తూర్పు వైపు తల పెట్టి నిద్రించడం కూడా మంచిదని శాస్తం చెప్తుంది. ఈ దిశలో తలపెట్టి పడుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దీనితో పాటు జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. పడమర వైపు తల పెట్టి నిద్రించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఈ దిక్కుకు అధిపతి వరుణ్ దేవ్. అటువంటి పరిస్థితిలో ఈ దిశలో తల పెట్టి పడుకోవడం గౌరవాన్ని పెంచుతుంది.వాస్తు శాస్త్రం ప్రకారం మంచం ఎప్పుడూ తలుపుకు ఎదురుగ ఉంచకూడదు. అలా ఉంచితే ఒత్తిడి పెరుగుతుంది. రాత్రుళ్లు రక రకాల పీడకలలు వస్తాయి.
Also Read: Injectable Moisturizers: ఇంజెక్షన్ రూపంలో తీసుకునే మాయిశ్చరైజర్స్.. మంచివేనా..?