Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!
- Author : Vamsi Chowdary Korata
Date : 18-06-2026 - 6:05 IST
Published By : Hashtagu Telugu Desk
హిందువులలో ఎక్కువ శాతం మంది కొలిచే దేవతలలో లక్ష్మీదేవి కూడా ఒకరు. సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కష్టాల నుంచి గట్టెక్కుతారని నమ్ముతారు. అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదని భావిస్తారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకునే వారు తమ ఇంట్లోని పూజా మందిరంలో కొన్ని వస్తువులను ఉంచాలట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. నెమలి ఈకలను మీ ఇంట్లోని పూజా గదిలో పెట్టాలట.
ఎందుకంటే దీనివల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి (పాజిటివ్ ఎనర్జీ) ఉంటుంది. వీటితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చట. అలాగే మీ సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయట. లక్ష్మీదేవిని నిష్టగా పూజించాలట. అదేవిధంగా మీ ఇంట్లోని పూజా మందిరంలో గంగాజలాన్ని ఉంచడం మంచిది. ఎందుకంటే హిందూ మతంలో గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే గంగాజలాన్ని మీ ఇంటి పూజా గదిలో పెట్టాలి. దీంతో లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందట. హిందూ మతంలో శంఖాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. దక్షిణ శంఖాన్ని లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా భావిస్తారు. కాబట్టి ఈ శంఖంలో గంగాజలాన్ని నింపి ఇంటి పూజా గదిలో పెట్టవచ్చట.
దీనివల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చట. శివలింగం శివునికి చిహ్నం. అందుకే మీ ఇంటి పూజా గదిలో ఒక శివలింగాన్ని తప్పకుండా పెట్టాలట. అలాగే క్రమం తప్పకుండా శివలింగాన్ని ఆరాధించాలట. శివలింగానికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుందని చెబుతున్నారు. హిందూ మతంలో మొదట పూజించే దేవుడు వినాయకుడు. అందుకే వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంటి పూజా గదిలో తప్పకుండా ఉంచాలట. విగ్రహం ముఖం ఉత్తర దిశ వైపు ఉండాలని గుర్తుంచుకోవాలట.