Shani Amavasya 2025: శని అమావాస్య ఎప్పుడు వచ్చింది.. ఈ రోజున వేటిని దానం చేస్తే మంచి జరుగుతుందో తెలుసా?
2025లో శని అమావాస్య పండుగ ఎప్పుడు వచ్చింది. ఈ పండుగ రోజున ఏం చేయాలి? ఎలాంటి వస్తువులు దానం చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:00 PM, Mon - 17 March 25

హిందూమతంలో అమావాస్య తిదిని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఏడాదికి 12 అమావాస్య తిథిలు ఉంటాయి. ప్రతి అమావాస్య తిధికి ఒక సొంత ప్రాముఖ్యత ఉంటుంది. వీటిలో శని అమావాస్య కూడా ఒకటి. శనివారం రోజు వచ్చే అమావాస్యను శని అమావాస్య అని అంటారు. శని అమావాస్య ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వస్తుంది. శనీశ్వరుడు అమావాస్య రోజున జన్మించాడని నమ్ముతారు. కనుక శనీశ్వరుడు కోపం నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజున శని దేవుడిని పూజిస్తూ ఉంటారు.
మరి శని అమావాస్య ఈసారి ఎప్పుడు వచ్చింది అన్న విషయాన్ని వస్తే.. సంవత్సరంలో చివరి అమావాస్య పాల్గుణ మాసంలో వస్తుంది. ఈ సారి ఏడాది చివరి అమావాస్య శనివారం రోజున రావడంతో శని అమావాస్యగా ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. అమావాస్య తిధి మార్చి 28న సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ తిధి మర్నాడు మార్చి 29న సాయంత్రం 4:30 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథిని ముఖ్యమైందిగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో శని అమావాస్య మార్చి 29న జరుపుకుంటారు.
కాగా శనీశ్వరుడు కోపాన్ని శాంతింప జేయడానికి, దానానికి శని అమావాస్య రోజు ఉత్తమ రోజుగా పరిగణించాలని చెబుతున్నారు. అలాగే ఈ రోజున శని దేవునికి సంబంధించిన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావించాలని చెబుతున్నారు. కాగా శని అమావాస్య రోజున శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆవ నూనెలో కలిపిన నువ్వులను సమర్పించాలట. నల్లని వస్తువులను దానం చేయాలని చెబుతున్నారు. ఈ రోజున శనీశ్వరుడికి అభిషేకం చేయాలట. శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు మంత్రాలను కూడా జపించాలని చెబుతున్నారు. శనీశ్వరుడు కర్మకు తగిన ఫలితాలను ఇచ్చేవాడు అని అర్థం. అంతేకాకుండా శనీశ్వరుని న్యాయ దేవుడు అని కూడా పిలుస్తారు. అలాగే శనీశ్వరుడు మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని అంటూ ఉంటారు.