Karthika Masam: అదృష్టం, ఐశ్వర్యం కోసం కార్తీకమాసంలో ఎలాంటి నియమాలు పాటించాలో మీకు తెలుసా?
Karthika Masam: కార్తీకమాసంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల అదృష్టం అలాగే ఐశ్వర్యం కలిసి వస్తుందని చెబుతున్నారు. మరి కార్తీక మాసంలో పాటించాల్సిన ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:33 AM, Thu - 30 October 25
Karthika Masam: హిందువులు కార్తిక మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. తెలుగు మాసాలాలో కార్తీకమాసం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే ఈ మాసంలో చేసేటటువంటి పూజలు పరిహారాలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయని నమ్మకం. వాటితో పాటు కార్తీకమాసంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. మరి కార్తీక మాసంలో పాటించాల్సిన ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం చాలా మంచి అలవాటు అని చెబుతున్నారు. ఆ సమయంలో నిద్ర లేచి కార్తీక స్నానాలు ఆచరించి ధ్యానం, పూజలు చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు దేవతల అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతున్నారు. వేకువ జామున చల్ల నీటితో స్నానం చేస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు. ఒకవేళ మీకు నది స్నానం కుదరకపోతే మీరు స్నానం చేసే నీటిలో తెలిసి ఆకులు వేసుకొని స్నానం చేయవచ్చు అని చెబుతున్నారు. అదేవిధంగా కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి మొక్క వద్ద దీపారాధన తప్పనిసరిగా చేయాలట.
ఇలా తులసి చెట్టు ఎదురుగా దీపారాధన చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ఆమె అనుగ్రహం కలిగేలా చేస్తుందట. అదేవిధంగా ఈ మాసంలో చేసేటటువంటి దీపదానం కూడా ప్రత్యేక ఫలితాలను అందిస్తుందట. దేవాలయాలు, నదీ తీరం, తులసి మొక్క వద్ద ఈ దీపాలను దానం చేస్తే ఇంకా మంచిదట. కార్తీక మాసంలో శివుడికి పూజ చేస్తే మంచిదని ముఖ్యంగా ఈ మాసంలో ఉపవాసంతో చేసే పూజలు మరింత ప్రత్యేక ఫలితాలను అందిస్తాయని చెబుతున్నారు. శివయ్యకు అభిషేకం చేస్తే ఆయన అనుగ్రహం ఇంకా తొందరగా కలుగుతుందట. కార్తీక మాసంలో విష్ణు కి పూజ చేస్తున్నట్లయితే తులసీదళాలను తప్పనిసరిగా పూజలో ఉంచాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతుందట. అలాగే కార్తీకమాసంలో చేసే దానాలు కూడా మంచి ఫలితాలను అందిస్తాయట. అన్నదానం, ధన దానం వస్త్ర దానం వంటి దానాలు మంచి ఫలితాలను అందిస్తాయని చెబుతున్నారు.