Chilukuru : చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ పై సంచలన ఆరోపణలు
Chilukuru : రంగరాజన్ ఇంటికి వెళ్లిన సమయంలో, ఆయన చేయకూడని పని చేస్తూ కనిపించారని తెలిపారు. ఆ దృశ్యాలను కెమెరాలో రికార్డు చేశామని పేర్కొన్నారు.
- By Sudheer Published Date - 10:44 AM, Wed - 30 April 25

చిలుకూరు బాలాజీ టెంపుల్ (Chilkur Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్ పేరు మరోసారి వివాదాల్లోకి చేరింది. రామరాజ్యం నేత వీర రాఘవ రెడ్డి (Ramarajyam Veera Raghavareddy) తాజాగా రంగరాజన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం, రంగరాజన్ ఇంటికి వెళ్లిన సమయంలో, ఆయన చేయకూడని పని చేస్తూ కనిపించారని తెలిపారు. ఆ దృశ్యాలను కెమెరాలో రికార్డు చేశామని పేర్కొన్నారు. అయితే ఆ ఫుటేజ్‌ను తీసుకెళ్లే ప్రయత్నంలో రంగరాజన్ తాను మరియు తన సహచరులపై దాడికి పాల్పడ్డారని వీర రాఘవరెడ్డి ఆరోపించారు.
Virat Kohli: కోహ్లీ అంటే ఇది.. తన చిన్ననాటి గురువుకు పాదాభివందనం, వీడియో వైరల్!
ఈ నేపథ్యంలో వీర రాఘవరెడ్డి ధర్మరక్షణ కోసం సవాళ్లు విసిరారు. దేశవ్యాప్తంగా ఆలయ భూములు, హక్కులను కాపాడేందుకు ప్రతి ఊరిలో అర్చకులను సైనికులుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై స్పందిస్తూ.. ఫ్యాంట్లు ఇప్పించి హిందువులను హత్య చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి దాడులను ఎదుర్కొనేందుకు 27 వేల మందితో ఒక భద్రతా సైన్యం ఏర్పాటు చేయాలని సూచించారు.
మూడు నెలల క్రితం రంగరాజన్‌పై వీర రాఘవరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతోపాటు, బీఆర్ఎస్ నేతలు కూడా రంగరాజన్‌కు మద్దతుగా నిలిచారు. సీఎం ఆదేశాలతో రంగరాజన్‌పై దాడి చేసినవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ వివాదం కొత్త మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో చిలుకూరు టెంపుల్ చుట్టూ రాజకీయ వేడి పెరుగుతోంది.