Financial Problems: ఇంట్లో డబ్బులు సమస్యలా.. ఈ ఒక్క మొక్క నాటితే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే!
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఇంట్లో తప్పనిసరిగా ఒక్క మొక్క నాటడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:30 PM, Sun - 22 December 24

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక సమస్యల కారణంగా లేనిపోని ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడం కోసం పూజలు పరిహారాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు.. వాటితో పాటుగా ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మొక్క నాటితే చాలు ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ మొక్క ఏది? ఆ మొక్కను ఏ దిశలో నాటుకోవాలి అన్న విషయానికి వస్తే..
హిందూ ధర్మం లో తులసి మొక్క తర్వాత అంత పవిత్రత కలిగిన మొక్క తమలపాకు. హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా అందులో తమలపాకు తప్పనిసరిగా ఉండాల్సిందే. తమలపాకులు లేకుండా చాలా రకాల వాతలు పూజలు నోములు పూర్తి కావు. తమలపాకు చెట్టును కూడా ఎవరు పడితే వారు ముట్టుకోవడం ఆకులు కోయడం లాంటివి చేయకూడదు. తులసి మొక్కను ఏ విధంగా అయితే అంటూ ముట్టు అయిన వారు తగలకుండా ఉంటారో అదే విధంగా తమలపాకు విషయంలో కూడా ఆ జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి తమలపాకు తీగ మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తూ ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టే. ఈ మొక్క ఏపుగా పెరిగితే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా మనపై ఉన్నట్టే.
అంతేకాకుండా పట్టిందల్లా బంగారమే అవుతుందట. తమలపాకు చెట్టు ఉన్న ఆ ఇంట్లో శనీశ్వరుడుకి తావు ఉండదని, భూత ప్రేత పిశాచులు కూడా ఇంటి దరిదాపుల్లోకి కూడా రావని పండితులు చెబుతున్నారు. ఇది ఇంటి ఆవరణలో ఉంటే ఎలాంటి గ్రహ దోషాలు ఉండవట. అయితే తమలపాకు చెట్టు ఇంట్లో ఏ దిశలో పడితే ఆ దిశలో ఉంటే ఈ లాభాలన్నీ ఉండవు. వాస్తు ప్రకారమే తమలపాకు చెట్లు ఇంట్లో ఉండాలి. తమలపాకు ఈ మొక్కను ఇంటికి తూర్పు వైపు ఉంచితే చాలా మంచిదట. ఈ మొక్క బాగా పెరగాలంటే సూర్య రశ్మి బాగా తగిలే చోట పెట్టాలి. అలాగని మరీ ఎండలో పెడితే మొక్క మాడిపోతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే తమలపాకుల్లో విటమిన్ సి, కాల్షియం రిబోఫ్లావిన్, థయామిన్, నియాసిన్, కెరోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
ఇందులో తక్కువ మెుత్తంలో కొవ్వులు ఉంటాయి. తమలపాకు నమలడం వల్ల జీర్ణక్రియతో పాటు రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుందట. ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు ప్రేగులను క్లీన్ చేస్తాయట. మైగ్రేన్ తో బాధపడేవారు తలనొప్పి వచ్చినప్పుడు ఆకులను తలపై పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుందట. చెవి ఇన్ఫెక్షన్లకు తమలపాకు బాగా పనిచేస్తుందట. కొబ్బరి నూనెలో రెండు చుక్కల తమలపాకుల రసం కలుపుకుని చెవిలో వేసినా నొప్పి తగ్గుతుందట. ఈ ఆకుల్లో యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ఎక్కువ. దగ్గుకు బాగా పనిచేస్తుందట. తమలపాకులు, దాల్చిన చెక్క, యాలకులు వేసి మరగబెట్టిన నీటిని వడకట్టి తాగితే దగ్గు తగ్గుతుందట.