Vastu Tips: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా.. అయితే 4 వస్తువులు ఆ దిక్కున ఉంచాల్సిందే?
సాధారణంగా కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగలడం లేదని బాధపడుతూ
- By Nakshatra Published Date - 06:00 AM, Wed - 15 February 23
సాధారణంగా కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యలు వెంటడానికి వాస్తు ప్రకారంగా కూడా కారణాలు ఉంటాయి. అయితే డబ్బు అయిపోతుంది అనుకున్న వారు ఐశ్వర్యానికి అది దేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి. కొంతమంది ఎన్ని పూజలు చేసినా కూడా ఆర్థిక ఇబ్బందులు వేధిస్తూనే ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులకు వాస్తు దోషం కూడా కారణం కావచ్చు. ఇంట్లో నిర్మించడంతోపాటు ఇంటిని సరైన దిక్కుకు వాస్తు ప్రకారంగా నిర్మించారా లేదా అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి అనుకుంటే ఉత్తరం దిక్కున 4 వస్తువులను పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇంటి ప్రధాన ద్వారం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మించుకంటే ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఉండవు. ఇంటి ప్రధాన ద్వారం సరైన దిశలో లేకుంటే అనేక రకాల సమస్యలు ఏర్పడుతాయి. ఎప్పుడైనా ఇంటి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉండాలి. అప్పుడే లక్ష్మి మాత అనుగ్రహం నిరంతరాయంగా లభిస్తుంది. అలాగే గాజు వస్తువులు.. ఇంట్లో గాజు వస్తువుల దోషాలు కూడా ఉంటాయి. వాస్తు శాస్త్ర నిపుణుల సూచనల ప్రకారం అద్దం సరైన దిశలో ఉంచకపోతే కుటుంబంలో సమస్యలు ఏర్పడుతాయి. అది డబ్బు కొరతకు దారితీస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి అద్దం ఉత్తరం వైపున ఉండాలి. ఇది శుభప్రదంగా భావిస్తారు. మనీ ప్లాంట్.. ఇంట్లో మనీ ప్లాంట్ ఉండటం చాలా మంచిది.
ఈ మొక్క ఎంత వేగంగా పెరిగితే ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సు అంతగా వృద్ధి చెందుతాయని అర్థం. మనీ ప్లాంట్ను నాటడం ద్వారా ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. అనేక చింతలు తొలగిపోతాయి. మనీ ప్లాంట్ను ఇంట్లో ఉత్తరం వైపు ఉంచాలి. వంటగది.. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఉత్తరం వైపున ఉండాలి. ఇలా ఉంటే మంచిది అని అంటారు. అన్నపూర్ణ దేవి ఎల్లప్పుడు ఇక్కడే ఉంటుందని నమ్ముతారు. ఆహార కొరత ఎప్పుడూ ఉండదు.
Related News
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.