Thursday: గురువారం రోజు బాబాకు ఇవి సమర్పిస్తే చాలు కోరిన కోరికలు తీరుతాయట?
గురువారం రోజు బాబాకు కొన్నింటిని సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందట.
- By Anshu Published Date - 11:00 AM, Wed - 18 September 24

వారంలో గురువారం రోజు చాలామంది దేవుళ్లకు అంకితం చేయబడింది. అందులో ముఖ్యంగా గురువారం రోజు సాయిబాబాకు అంకితం చేయబడింది. ఈ రోజున బాబాకు ప్రత్యేకంగా పూజలు చేయడంతో పాటు ఆయనకు కొన్నింటిని సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా కలగడంతో పాటు కోరిన కోరికలు కూడా తీరుతాయని చెబుతున్నారు. మరి ఇంతకీ గురువారం రోజు ఏం చేయాలి? సాయిబాబాకు ఇష్టమైన ఆ పదార్థాలు ఏమిటి? వాటిని సమర్పిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కూరగాయలలో పాలకూరలో బాబాకు ఇష్టమైన కూరగాయ అని చెబుతుంటారు. కాబట్టి ఈ పాలకూరతో తయారుచేసిన ఆహార పదార్థాలను బాబాకు నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందట. అలాగే హల్వా అంటే కూడా బాబాకు చాలా ఇష్టమని, ఈ హల్వాను సాయిబాబాకు సమర్పిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. సాయిబాబాకు ఇష్టమైన వంటకాలలో కిచిడి కూడా ఒకటి. కాబట్టి గురువారం రోజు కిచిడిని బాబాకు సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయట. హిందూమతంలో కొబ్బరికాయలు చాలా విశిష్టత ప్రాముఖ్యత ఉంది. ఎటువంటి శుభకార్యం అయినా సరే ముందు కొబ్బరికాయ కొట్టి ఆ శుభకార్యాన్ని మొదలు పెడుతూ ఉంటారు.
అలాంటి కొబ్బరి కాయను బాబాకు సమర్పించాలని చెబుతున్నారు. పువ్వులలో బాబాకు గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. అందుకే చాలా వరకు సాయిబాబాకు ఆలయాల్లో గులాబీ పూలనే ఎక్కువగా అలంకరిస్తూ ఉంటారు. గులాబీ పువ్వులు గాని లేదంటే గులాబీలతో చేసిన దండను సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట. అలాగే బాబాకు పండ్లలో అన్ని రకాల పండ్లు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున ఆయనకు కొన్ని రకాల పండ్లు సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందట. అలాగే బాబా భక్తులు స్వీట్,డిజర్ట్ లను కూడా బాబాకు సమర్పించవచ్చని చెబుతున్నారు.