Nag Panchami: రేపే నాగ పంచమి.. పూజకు శుభ ముహూర్తం ఇదే..!
నాగదేవతను ఆరాధిస్తే మంచి జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. రేపు ఉదయం 06.01 నుంచి 8.37 వరకు పూజకు అనుకూలమైన సమయం ఉందని పండితులు చెబుతున్నారు.
- By Gopichand Published Date - 11:15 PM, Thu - 8 August 24

Nag Panchami: శ్రావణ మాసంలో శుక్ల పక్షం ఐదవ రోజున నాగ పంచమి (Nag Panchami)ని జరుపుకుంటారు. ఈసారి నాగ పంచమిని 9 ఆగస్టు 2024న జరుపుకుంటున్నారు. నాగ పంచమి పండుగ హిందూ మతం ప్రజల ప్రధాన పండుగలలో ఒకటి. ఈ రోజున నాగదేవతను పూజించే సంప్రదాయం ఉంది. మీరు నాగ పంచమి రోజున జాతకం నుండి కాల సర్ప దోషాన్ని తొలగించడానికి చర్యలు తీసుకోవచ్చు. ఈ చర్యలు చేయడం ద్వారా మీరు రాహు-కేతువుల చెడు ప్రభావాల నుండి ఉపశమనం పొందుతారు. ఈ చర్యల గురించి తెలుసుకుందాం.
అంతేకాకుండా ఈ రోజున నాగదేవతను ఆరాధిస్తే మంచి జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. రేపు ఉదయం 06.01 నుంచి 8.37 వరకు పూజకు అనుకూలమైన సమయం ఉందని పండితులు చెబుతున్నారు. అటు వేద పంచాంగం ప్రకారం పంచమి తిథి ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 12.36 గంటలకు ప్రారంభమై 10వ తేదీ తెల్లవారుజామున 03.14 గంటలతో ముగుస్తుంది.
Also Read: Citroen Basalt: సిట్రోయన్ ధర చూసి షాక్ అయిన ఎంఎస్ ధోనీ.. ప్రైస్ ఎంతంటే..?
కాలసర్ప దోషం లక్షణాలు
ఒక వ్యక్తి జాతకంలో కాలసర్ప దోషం ఉంటే ఎంత కష్టపడినా విజయం దక్కదు. ఒక వ్యక్తి తన కలలో పాములను చూస్తాడు. తరచుగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటాడు. దీనివల్ల ఉద్యోగంలో సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, వివాహాలలో ఆటంకాలు వస్తుంటాయి.
We’re now on WhatsApp. Click to Join.
కాలసర్ప దోషాన్ని వదిలించుకోవడానికి మార్గాలు
– కాలసర్ప దోషాన్ని వదిలించుకోవడానికి నాగ పంచమి రోజున ఒక జత వెండి పాముల ప్రతిమను ఇంటికి తీసుకురండి. ఈ జంటను పూజించండి. పచ్చి పాలు, బటాషా, పువ్వులు మొదలైనవి సమర్పించండి. ఇలా చేయడం వల్ల దోషం తొలగిపోతుంది.
– నాగ పంచమి నాడు శివుడు, నాగ దేవతను పూజించండి. గాయత్రీ మంత్రాన్ని జపించండి. గాయత్రీ మంత్రాన్ని మహామంత్రంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి.
ఆవు పేడతో ఇంటి ప్రధాన ద్వారం వద్ద పాము ఆకారాన్ని తయారు చేయండి. ఆవు పేడతో చేసిన ఈ పామును పూజిస్తే జాతకంలో కాల సర్ప దోషం నుండి ఉపశమనం లభిస్తుంది.
నాగదేవతను పూజించండి. ‘అనంత్, వాసుకి, శేష్, పద్మ, కంబల్, కర్కోటక్, అశ్వతర్, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళియ, తక్షక్, పింగళ్’ అనే 12 పేర్లను జపించండి.