HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Mukesh Ambani Antilia Residence Decorated With Jai Shri Ram

Ram Mandir: జై శ్రీరామ్‌ నామాలతో ముస్తాబైన ముఖేష్ అంబానీ ఆంటిలియా

భారతదేశ చరిత్రలో నేడు మరో అధ్యాయం చేరబోతోంది. నేడు అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠతో చరిత్ర సృష్టించనున్నారు. ఈ తరుణం కోసం సనాతనీయులతో పాటు యావత్ దేశం ఎంతో కాలంగా ఎదురుచూసింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 22-01-2024 - 7:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Mandir
Ram Mandir

Ram Mandir: భారతదేశ చరిత్రలో నేడు మరో అధ్యాయం చేరబోతోంది. నేడు అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠతో చరిత్ర సృష్టించనున్నారు. ఈ తరుణం కోసం సనాతనీయులతో పాటు యావత్ దేశం ఎంతో కాలంగా ఎదురుచూసింది. ఈ రోజు భగవంతుడు అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో కూర్చుని భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాంలాలా విగ్రహాన్ని సరైన స్థలంలో ఏర్పాటు చేయనున్నారు.

ఈ రోజు అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా దేశంంలోని అనేక ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు అందంగా ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇళ్లు కూడా అందంగా అలంకరించారు. అంబానీ తన ఇళ్ళు ఆంటిలియా ను జై శ్రీరామ్‌ నామాలతో అందంగా అలంకరించారు. 27 అంతస్తుల ఇంట లోపల, వెలుపల కూడా హిందూ మతతత్వం ఉట్టిపడేలా శ్రీరామునికి చెందిన చిహ్నాలు, చిత్రాలు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం ఆయన ఇంటి పై జై శ్రీరామ్‌ అనే నినాదాలు కనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

#WATCH | Mumbai: Reliance Industries Chairman and MD Mukesh Ambani's house 'Antilia' decked up ahead of the Ram Mandir 'Pran Pratistha' ceremony in Ayodhya tomorrow. pic.twitter.com/mKoTRNWZSV

— ANI (@ANI) January 21, 2024

మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలంలో ఠాకూర్ కేశవదేవ్ రామునిగా కనిపిస్తుండగా, భగవత్ భవన్‌లో రాధా-కృష్ణులు కూడా సియారామ్‌గా కనిపిస్తారు. తలపై బంగారు కిరీటం, రత్నాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, చేతిలో వెండి ధనుస్సు ధరించి ఠాకూర్ బంకే బిహారీ పురుషోత్తం శ్రీరాముడి వేషంలో భక్తులకు దర్శనం ఇస్తారని ఆలయ సేవాయత్ ఆచార్య గోపీ గోస్వామి తెలిపారు.

అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్టా వేడుకకు ముందు అమెరికాలోని టైమ్స్ స్క్వేర్‌లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ రామ్ మందిర్ సభ్యులు లడ్డూలను పంపిణీ చేశారు. ఈ జన్మలో ఈ రోజు చూస్తామని అనుకోలేదని అమెరికాలో ఉంటున్న ప్రేమ్ భండారీ అన్నారు. మరికాసేపట్లో అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరగనుంది. దీంతో టైమ్స్ స్క్వేర్‌లో కూడా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు.

Also Read: Ram Mandir Photos : ముస్తాబైన అయోధ్య రామమందిరం.. ఫొటోలు, ప్రారంభోత్సవ విశేషాలివీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Antilia
  • Decorate
  • Jai Shri Ram
  • mukesh ambani
  • mumbai
  • residence

Related News

Why did Mumbai's famous, 110-year-old Parsi Dairy Farm lose its license?

Parsi Dairy Farm: ముంబైలోని 110 ఏళ్ల పురాతన, ప్రసిద్ధ పార్సీ డెయిరీ ఫామ్.. తన లైసెన్సును ఎందుకు కోల్పోయింది?

మంగళ, బుధవారాల్లో ఎఫ్‌డిఎ రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విస్తృత తనిఖీలలో ఈ నియంత్రణ చర్య తీసుకోబడింది. తనిఖీలలో తీవ్రమైన పరిశుభ్రత మరియు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో, మహారాష్ట్ర ఆహార మరియు ఔషధ పరిపాలన (ఎఫ్‌డిఎ) ముంబైలోని ప్రసిద్ధ పార్సీ డెయిరీ ఫామ్ లైసెన్సును నిలిపివేసింది. ఎఫ్‌డిఎ కొనసాగిస్తున్న ‘సురక్షిత ఆహారం, సురక్షిత మహారాష్ట్ర’ ప్రచార

  • Water levels in Mumbai's lakes have dropped to 49.73 percent; the IMD has issued a 'Yellow Alert' for Thane.

    Mumbai Lake: ముంబై సరస్సుల నీటి మట్టం 49.73 శాతానికి పడిపోయింది.. థానేలకు IMD ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd