HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Matsya Jayanti Vishnu Matsyavatara Features

Vishnu Matsya Avatara: మత్స్య జయంతి, విష్ణువు మత్స్యావతార విశేషాలు

ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు దశావతారములు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. కొందరు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచికగా చెబుతారు.

  • By CS Rao Published Date - 08:30 AM, Fri - 24 March 23
  • daily-hunt
Matsya Jayanti, Vishnu Matsyavatara Features
Matsya Jayanti, Vishnu Matsyavatara Features

ధర్మరక్షణ కోసం శ్రీ మహా విష్ణువు (Sri Maha Vishnu) దశావతారములు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. కొందరు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచికగా చెబుతారు. బ్రహ్మకు ఒక పగలు అంటే – వెయ్యి మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగా చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని ‘కల్పం’ అని అంటారు.

మత్స్యావతారం అసలు కథ:

వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, విష్ణు (Vishnu) భక్తుడు. ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి , సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడినది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలి లోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది “రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి , దయచేసి నన్ను రక్షించు” అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు… ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అంతట ఆ మత్స్యం “తాను శ్రీమన్నారాయణుడుని అని, ఏడు రోజులలో ప్రళయం రానున్నదని, సర్వజీవరాశులు నశించిపోతాయి అని , ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని” పలికింది. ఒకపెద్ద నౌకను నిర్మించి, అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు , బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది.

మీనరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి , ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి , ‘వైవస్వత మనువు’ గా ప్రశిద్ధికెక్కాడు.

బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటినుండి వేదాలు జారి క్రింద పడగా , “సొమకాసురుడు” అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి , సముద్రగర్భంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా , అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి , అతని కడుపుని చీల్చి.. వేదాలను – దక్షిణావృత శంఖాన్ని తీసుకొని , బ్రహ్మవద్దకు వచ్చాడు. శంఖాన్ని తానూ తీసుకొని , శిధిలమైన వేదభాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యావతారం.

మత్స్య జయంతి విధి విధానాలు:

ఈ రోజు విష్ణుమూర్తికి (Vishnu Murthy) అంకితం చేయబడిన రోజు , కావున ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించడం , ఉపవాస దీక్ష గావించడం వంటి వాటి ద్వారా ఆ దేవుని కృపకు పాత్రులవగలరని పురాణాల సారాంశం. ఒకవేళ ఈ ప్రత్యేకమైన రోజు ఉపవాస దీక్షను మరియు పూజలను వేకువ జామునే ఆరంభించగలిగితే , అదృష్టం వరించి మోక్ష మార్గానికి దారి సుగమం అవుతుందని చెప్పబడింది. మోక్షం , హిందూమతం యొక్క అంతిమ లక్ష్యం. అయినప్పటికీ , ఈ ప్రత్యేకమైన ఉపవాస దీక్షలో , పూర్తిగా ఆకలితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాలు పండ్లు స్వీకరించవచ్చు అని సూచించబడినది.

Also Read:  April 6 to May 2: వృషభ రాశిలో శుక్రుడి సంచారం.. 6 రాశుల వారిపై కనక వర్షం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • features
  • god
  • Jayanti
  • Lord
  • Matsya
  • Matsyavatara
  • vishnu

Related News

Kartika Purnima

Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

ధనుస్సు రాశి, మకర రాశి వారు శెనగపప్పు, అరటిపండు, పసుపు వస్త్రాలు, కుంకుమపువ్వు, పసుపు, మొక్కజొన్న దానం చేయడం ద్వారా సంతానానికి అదృష్టం (సౌభాగ్యం) లభిస్తుంది.

  • Lord Shiva Vishnu

    Kartik Purnima : నవంబర్‌ 1 పవిత్రమైన దేవుత్తని ఏకాదశి.. కార్తీక మాసం!

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd