Sankrathi: మకర సంక్రాంతి రోజు ఇలాంటి వస్తువులు దానం చేస్తున్నారా.. దరిద్రాన్ని కోరి తెచ్చుకున్నట్టే!
మకర సంక్రాంతి పండుగ రోజు దానం చేయడం మంచిదే కానీ, కొన్ని రకాల వస్తువులు దానం చేస్తే ఏరి కోరి మరీ దరిద్రాన్ని తెచ్చుకున్నట్టే అవుతుందని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:34 PM, Sun - 12 January 25

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన, తొలి పండుగ సంక్రాంతి పండుగ. కొత్త సంవత్సరంలో జరుపుకునే హిందూ మతానికి సంబంధించిన మొదటి పండుగ. సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రాంతి జరుపుకుంటారు. సూర్య భగవానుడిని మకర సంక్రాంతి రోజున పూజిస్తారు. ఈ రోజు ఆయనకు నువ్వుల లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఈ ఏడాది మకర సంక్రాంతిని జనవరి 14 మంగళవారం రోజున జరుపుకోనున్నారు. ఈ రోజు సూర్యభగవానుడు. జనవరి 14వ తేదీ ఉదయం 9.03 గంటలకు మకర రాశిలోకి అడుగు పెట్టనున్నాడు.
మకర సంక్రాంతి రోజున పుణ్య నదులలో స్నానాలు చేసి, దానాలు చేస్తారు. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేసిన తర్వాత దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని అయితే ఈ రోజు పొరపాటున కూడా దానం చేయకూడనివి కొన్ని ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మరి సంక్రాంతి పండుగ రోజు ఎలాంటివి దానం చేయకూడదు అన్న విషయానికి వస్తే.. మకర సంక్రాంతి రోజున నలుపు రంగు దుస్తులు దానం చేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి. నలుపు రంగు బట్టలు దానం చేయడం వల్ల గ్రహాల అశుభాలను కలుగజేస్తాయని నమ్మకం. కనుక మకర సంక్రాంతి రోజున పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు దానం చేయకండి. అయితే మకర సంక్రాంతి రోజున పసుపు రంగు బట్టలు దానం చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుందట.
అలాగే ఈ మకర సంక్రాంతి పండుగ రోజు పొరపాటున కూడా నూనెను దానం చేయకూడదు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. ఒకవేళ సంక్రాంతి పండుగ రోజు నూనె దానం చేస్తే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయట. మకర సంక్రాంతి రోజున నూనెను దానం చేయడం వల్ల మనిషి చేసే పనులపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఈ కారణంగా మకర సంక్రాంతి రోజున నూనెను దానం చేయవద్దని పండితులు. అలాగే మకర సంక్రాంతి రోజున పదునైన వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం కాదట. కాబట్టి ఈ రోజున కత్తులు, కత్తెరలు లేదా కొన్ని రకాల వస్తువులు దానం చేయకూడదు. పదునైన వస్తువులను దానం చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రవాహం పెరుగుతుందని చెబుతున్నారు. ఇంట్లో గొడవలు కూడా రావచ్చట. అటువంటి పరిస్థితిలో మకర సంక్రాంతి రోజున పదునైన వస్తువులను దానం చేయకూడదని చెబుతున్నారు.