Prasadam Benefits: భగవంతుని ప్రసాదం ఎందుకు స్వీకరించాలి.. ప్రసాదాన్ని ఎందుకు పంచాలో తెలుసా?
మామూలుగా దేవుళ్లకు నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించడంతో పాటు నలుగురికి పెట్టాలని చెబుతూ ఉంటారు. అయితే నైవే
- Author : Anshu
Date : 05-12-2023 - 8:55 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా దేవుళ్లకు నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించడంతో పాటు నలుగురికి పెట్టాలని చెబుతూ ఉంటారు. అయితే నైవేద్యాన్ని పంచిపెట్టడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. భగవంతుడి నైవేద్యాన్ని స్వీకరించడం, ఇతరులకు పంచి పెట్టడం అన్నది పరమ పవిత్రంగా భావిస్తారు. అయితే ప్రసాదం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఆ ప్రసాదాలను ఇతరులకు ఎందుకు పంచిపెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా స్వచ్ఛంగా మారుతుంది. అలాగే మనసులో మెదడులో సానుకూల భావోద్వేగాలు ఏర్పడతాయి.
భగవంతుడికి సమర్పించే నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల భగవంతునితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. ప్రసాదం మన మనస్సులో భగవంతుని పట్ల భక్తిని, విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలను అందించే వేల రకాల ప్రసాదాలు ఉన్నాయి. ప్రసాదం అన్ని రకాల పోషకాలను కలిగి ఉండటం వల్ల మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పంచామృత ప్రసాదం, చరణామృత ప్రసాదం, బెల్లం, మినుము, కొబ్బరి, తులసి ఇతర వంటకాలతో కలిపి తింటే రోగాలు నయమవుతాయి. మనం భగవంతుని ప్రసాదాన్ని ఇతరులకు పంచిపెట్టడం వల్ల, మీ పట్ల ప్రజలు కూడా మంచి అభిప్రాయాన్ని పెంపొందించుకుంటారు. దీని వల్ల ఎవరి మనసులోను మీ పట్ల ఎలాంటి అనుబంధం లేదా ద్వేషం ఏర్పడదు. దేవుని పట్ల ప్రేమ కూడా మీ హృదయంలో ఉంటుంది.
భగవంతునితో నిరంతరం అనుసంధానం కావడం ద్వారా, మనస్సు స్థితి, దిశ మారుతుంది. దీని ద్వారా మీరు దైవత్వాన్ని అనుభవిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొనడానికి అవసరమైన మనో బలాన్ని పొందుతారు. దేవతలు కూడా కష్ట సమయాల్లో మీతో కలిసి ఉంటారు. భగవంతునికి నైవేద్యాన్ని సమర్పించడం, అనంతరం ఇతరులకు దానం చేయడం ద్వారా మనకు స్వర్గంలో నివాసం లభిస్తుంది. అలాగే, దేవతల నివాసానికి వెళ్లి, అంటే దేవతలను పూజించి, వారికి నైవేద్యం సమర్పించి, ఆ తర్వాత ప్రసాదం తిని, ఇంటికి చేరుకున్న వారికి పునర్జన్మ ఉండదని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు.