Donate: ఈ వస్తువులను రహస్యంగా దానం చేస్తా చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం!
ఇప్పుడు చెప్పబోయే వస్తువులను ఎవరికీ చెప్పకుండా రహస్యంగా దానం చేయడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 09:30 AM, Wed - 21 May 25

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని అంటూ ఉంటారు. అన్నదానంతో పాటు చాలా రకాల దానధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. రక్తదానం,వస్తువు దానం, అవయవ దానం ఇలా ఎన్నో రకాల దానధర్మాలు చేస్తూ ఉంటారు. వీటి వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని దేవుడు ఆశీస్సులు లభిస్తాయని చాలామంది గట్టిగా విశ్వసిస్తూ ఉంటారు. దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం కలుగుతుందని నమ్మకం. అందుకే చాలామంది వారికి ఉన్నంతలో స్తోమతకు తగ్గట్టుగా చిన్న చిన్నగానే దానధర్మాలు చేస్తూ ఉంటారు. మిగతా విషయాల సంగతి పక్కన పెడితే దానధర్మాలు చేసినప్పుడు నలుగురికి తెలియకుండా చేయడం మంచిదని చెబుతుంటారు.
కానీ కొంతమంది మాత్రం చేసేది చిన్న సహాయమే అయినా కూడా బయట పెద్ద సహాయం చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగవు అని చెబుతున్నారు. అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ వస్తువులను దానం చేసినప్పుడు నలుగురికి చెప్పి దానం చేయకూడదట. ఈ వస్తువులను రహస్యంగా దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఎలాంటి వస్తువులను రహస్యంగా దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది పూజ చేసిన తర్వాత నైవేద్యంగా పెట్టిన పండ్లను తీసుకొని ఇతరులకు ప్రసాదంగా పంచి పెడుతూ ఉంటారు.
అయితే ఇలా ఇవ్వడం మంచిదే కానీ ఆ పండును పూర్తిగా అలాగే ఇవ్వాలట. కట్ చేసి పొరపాటున కూడా ఇవ్వకూడదు అని చెబుతున్నారు. పూర్తి పండును అలాగే ఇతరులకు దానంగా ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయట. అలాగే జల దానం కూడా ఎంతో మంచిదట. వేసవిలో ఇతరుల దాహాన్ని తీర్చడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుందని చెబుతున్నారు. బెల్లం కూడా దానం చేయడం ఎంతో శుభకరమని పండితులు చెబుతున్నారు. ఎవరైతే వేసవిలో రహస్యంగా బెల్లం దానం చేస్తారో అలాంటి వారి జాతకంలో సూర్యుడి స్థానం బలపడుతుందట. అదేవిధంగా పెరుగును కూడా దానం చేయటం వల్ల జాతకంలో శుక్రుని స్థానం బలపడుతుందట. అందుకే ఈ పదార్థాలను వేసవిలో రహస్యంగా దానం చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు. అయితే ఎప్పుడైనా సరే ఎలాంటి వస్తువులనైనా కూడా దానం చేసిన తర్వాత దానిని పదిమందికి గొప్పగా చెప్పుకోవడం వల్ల పుణ్యఫలం కూడా దక్కదని దానం చేసిన ఫలితం దక్కదు అని పండితులు చెబుతున్నారు.