janmashtami 2024: కృష్ణాష్టమి రోజు ఎలాంటి వస్తువులు దానం చేయాలో మీకు తెలుసా?
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:00 PM, Sun - 25 August 24

రేపే శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఇప్పటికే శ్రీకృష్ణుని మందిరాలలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఇళ్లలో కూడా చాలామంది శ్రీ కృష్ణాష్టమి జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే చాలామంది కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. అలా కలగాలంటే తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అన్నదానం చేయడం లేదంటే ఆహారాన్ని ఇవ్వడం మంచి పనిగా చెప్పవచ్చు. కృష్ణాష్టమి రోజున ఆకలి ఉన్నవారికి అలాగే పేద వారికి ఆహారం అందించడం చాలా మంచిదని చెబుతున్నారు.
ఇలా చేస్తే ఇంట్లో ఆహారం కొరత ఉండదట. అదేవిధంగా కుటుంబంలో ఉండే బాధలు దుఃఖాలు అన్ని తొలగి జీవితంలో సంతోషం నిండుతుందని చెబుతున్నారు పండితులు. అలాగే కన్నయ్యకు వెన్న అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున వెన్న దానం చేయడం వల్ల శుక్ర దోషాలు తొలగిపోతాయట. అంతేకాకుండా కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయట. దీనితో పాటు సంపద కూడా పెరుగుతుందని చెబుతున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పేదలకు నిరుపేదలకు బట్టలు దానం చేయడం పవిత్రమైనదిగా చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల వ్యక్తి దుఃఖం, పేదరికం నుండి ఉపశమనం పొందుతాడు. దీనితో పాటు శ్రీకృష్ణుని ఆశీస్సులు కూడా లభిస్తాయట. శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున నెమలి ఈకలలు దానం చేయడం వల్ల సంతోషం కలుగుతుందట. నెమలి ఈకలను దానం చేయడం ద్వారా ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయట. అంతే కాకుండా వృత్తి, వ్యాపారాలలో కూడా చాలా పురోగతి లభిస్తుందని చెబుతున్నారు.అలాగే జన్మాష్టమి రోజున మురళిని దానం చేయడం కూడా చాలా పవిత్రమైనది. ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మీరు ఈ రోజున చెక్క వేణువును దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందట.