HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Is This The Story Of Parnasala

Parnasala: రాముడు నడయాడిన నేల.. ప‌ర్ణ‌శాల క‌థ ఇదేనా..?

రాముడు.. సుగణభిరాముడు. ఆయన జీవితంలోని ప్రతి అడుగు ఆదర్శం.

  • Author : Gopichand Date : 31-10-2022 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (7)
Cropped (7)

రాముడు.. సుగణభిరాముడు. ఆయన జీవితంలోని ప్రతి అడుగు ఆదర్శం. ఆయన మాటతప్పని మనిషి. ధర్మం తప్పని నడవడి. ధర్మానికే భాష్యం చెప్పిన ఆయన జీవితాన్ని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. తండ్రి ఆన మేరకు వనవాసం చేసాడు ఆ రామయ్య తండ్రి, దానిలో భాగంగా ఆయన దండకారణ్యంలో సంచరించినట్లు పలు ఆధారాలు, ఆనవాళ్లు మనవారు నేటికి చెప్పుకుంటారు. అలాంటి వాటిలో ఆ సీతారామలక్ష్మణులు సంచిరించిన వాటిలో ప్రధానంగా చెప్పుకునేది పర్ణశాల. అది ఎక్కడ ఉంది, దాని విశేషాలు తెలుసుకుందాం.

భద్రాచలంలో కొలువైన సీతారామచంద్రస్వామిని చూసేందుకు వచ్చిన భక్తులు తప్పనిసరిగా పర్ణశాల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. రాముడి వనవాస సమయంలో జరిగిన కొన్ని ఘట్టాలు ఇక్కడ కూడా ఉండటం ఇందుకు కారణం. భద్రాచలం పట్టణం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో సీతమ్మవారి పర్ణశాల ఉంది. సీతారాముల దేవస్థానం ఎంతటి ప్రఖ్యాతి చెందినదో ఈ పర్ణశాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.

పర్ణశాలకు ఓ ప్రత్యేకత ఉంది. రామాయణంలో ఒక ప్రముఖమైన ఘట్టం ఈ ప్రదేశంలో జరిగిందని ప్రాశస్తి. రాముడు, సీత, లక్ష్మణుడితో వనవాసానికి బయల్దేరి గోదావరి ఒడ్డున ఒక కుటీరం ఏర్పరుచుకొన్నారు. అదే ఈ పర్ణశాల. ఇక్కడ ప్రతి రాయికి, ప్రతిగుట్టకు ఓ చరిత్ర ఉంది. మరొక విశేషం ఏమిటంటే ఈ ప్రదేశం నుంచే రావణాసురుడు సీతమ్మని అపహరించాడట.

సీతారాములు ఉన్న కుటీరమే పర్ణశాల. దాదాపు వాళ్ల వనవాసంలోచాలా సమయం ఇక్కడే గడిపారని ఈ ప్రదేశ చరిత్ర చెబుతుంది. సీతమ్మ గోదావరిలో స్నానం చేసి, పర్ణశాల పక్కనున్న ‘రాధగుట్ట’పై చీర ఆరేసుకుంది అని అంటారు. ఇప్పుడు ఆ చోటుని నార చీర గురుతుల స్థలం అని అంటారు. పర్ణశాలకు వెళ్లే దారిలో ఒక కిలోమీటరు ముందే ఈ రాధగుట్ట ఉంది. ఇప్పుడు కూడా నాటి ఆనవాళ్లు ఉన్నాయి.

రాధగుట్ట పక్కనే మీకు లక్ష్మణుడు, శూర్పణఖల మధ్య సంఘర్షణ జరిగిన ఒక చిన్న గుట్ట ఉంది. పర్ణశాల పవిత్రక్షేత్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా ప్రభుత్వం తీర్చిదిద్దింది. చుట్టూ అందమైన గుట్టల నడుమ గోదావరి పరవళ్లు ఇక్కడికి వచ్చే వారిని ఆకర్షిస్తుంది. పర్ణశాలకు ఉన్న ప్రత్యేకతను పురస్కరించుకుని ఆ ప్రదేశంలో రామాయణ ఘట్టాలను కన్నులకు కట్టే బొమ్మలు, కుటీరం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ బాపుగారి బొమ్మలు. పర్ణశాలలో వెలసిన రామాలయాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు నిత్యం వస్తుంటారు. ఇది చాలా ప్రాచీన దేవాలయం. నిండుగా ప్రవహించే గోదావరి తీరంలో ఉన్న ఈ గుడిలో అడుగు పెడితే చాలు మహా ప్రశాంతంగా ఉంటుంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhadrachalam
  • Bhadradri-Kothagudem
  • lord sri rama
  • Parnasala
  • telangana
  • Telangana Temples

Related News

Inter Results 2026

TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

ఈ ఏడాది మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసేందుకు గతంలో కంటే ఎక్కువ కేంద్రాలను మరియు సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తోంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల ఫలితాలు

  • Tdp Mp Lavu Sri Krishna Devarayalu

    లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • Central Govt Good News2

    Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • New Amrit Bharat Express.

    తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Latest News

  • కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా సీఎం చంద్రబాబు

  • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

  • గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్‌ స్టవ్‌లకు భారీ గిరాకీ

  • నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

  • గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd