Sambrani Dhoop: వారంలో ఆరోజు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే చాలు.. సిరిసంపదలు మీ వెంటే?
సాధారణంగా ఇంట్లో నిత్య దీపారాధన చేయడంతో పాటు అప్పుడప్పుడు ఇంట్లో సాంబ్రాణి ధూపం కూడా వేయాలని పండితులు చెబుతూ ఉంటారు. సాంబ్రాణి ధూపం వేయడం వల్
- By Anshu Published Date - 10:10 PM, Wed - 7 June 23

సాధారణంగా ఇంట్లో నిత్య దీపారాధన చేయడంతో పాటు అప్పుడప్పుడు ఇంట్లో సాంబ్రాణి ధూపం కూడా వేయాలని పండితులు చెబుతూ ఉంటారు. సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఒక్కరోజు ధూపం వేసినా ఏడు రోజుల నెగిటివ్ ఎనర్జీని తరిమేయవచ్చట. మరి వారంలో ఏ రోజు ధూపం వేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…ఆదివారం గుగ్గిలంతో సాంబ్రాణి పొగ వేయడం వల్ల సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది.
సోమవారం ఆరోగ్య వృద్ధి, మానసిక ప్రశాంతత అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. కంటికి సంబంధించిన సమస్యలుండవు. అప్పుల బాధ తొలగిపోతుంది. బుధవారం ధూపం వేయడం వల్ల నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడంతో పాటూ పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గురువారం గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. శుక్రవారం వేయడం వల్ల లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి, అన్నింటా విజయం అందుకుంటారు
శనివారం.. సోమరితనం తొలగిపోతుంది. ఈతి బాధలు ఉండవు. శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది.
అయితే సిటిలలో ఉన్న వారికి సాంబ్రాణి దూపం వేయడానికి అగ్గి నిప్పులు లేకపోవడంతో చాలామంది సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తున్నారు. కానీ పూర్వం రోజుల్లో మాత్రం శుద్ధ చందనాన్ని కలిపి ఆవు పిడకల్లో గుగ్గిలంతో వెలిగించేవారు. ఇలా చేస్తే ఇంట్లో, పరిసరాల్లో ఉండే దోమలు, సూక్ష్మ క్రిములు ఈ పొగకి నశిస్తాయి. హానికరమైన రసాయనాలు ఉపయోగించరు కాబట్టి ఈ పొగ పీల్చడం వల్ల ఆరోగ్యానికి హాని జరగదు. శ్వాస సంబంధిత రుగ్మతలు లేకుండా చేస్తుంది. అలాగే సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండడం వల్ల ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి అంతా పాజిటివిటీ ఉంటుంది.