Sri Rama Navami: రూ.116 చెల్లిస్తే చాలు.. మన ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు అందుకోవచ్చు
శ్రీ రామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని టిఎస్ఆర్టీసీ నిర్ణయించింది. కావాల్సినవారు తమ కార్గో పార్సిల్
- By Vamsi Korata Updated On - 12:16 PM, Thu - 16 March 23

శ్రీ రామ నవమి (Sri Rama Navami) సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని టిఎస్ఆర్టీసీ నిర్ణయించింది. కావాల్సినవారు తమ కార్గో పార్సిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపిస్తామని తెలిపారు. రూ.116 చెల్లించి బుకింగ్ ను ప్రారంభించారు. ‘గతేడాది దాదాపు 89 వేల మందికి తలంబ్రాలను అందించాం. శ్రీ రామ నవమి (Sri Rama Navami) కి వెళ్లలేని భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి’ అని కోరారు. ఈ సేవలను పొందాలనుకునేవారు 9177683134, 7382924900, 9154680020 ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Also Read: Ponnambalam: నా తమ్ముడే నా పై విషం ప్రయోగం చేసాడు.. నటుడు పొన్నాంబలం సంచలన వ్యాఖ్యలు

Related News

Margadarshi: ‘మార్గదర్శి’ కి తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్
ఇటీవల ఏపీలో మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు చేసిన అంశం తెలంగాణ హై కోర్టుకు చేరింది. రామోజీరావు, శైలజా కిరణ్ పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దన్న..