Bathroom Vastu : మీ బాత్ రూమ్ లో ఈ వస్తువులను అస్సలు ఉంచొద్దు!
Bathroom Vastu : ఇంటిలో అతి ముఖ్యమైన అంశం వాస్తు.
- By Pasha Published Date - 07:20 PM, Wed - 27 September 23

Bathroom Vastu : ఇంటిలో అతి ముఖ్యమైన అంశం వాస్తు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మనం కొన్ని వస్తువులను బాత్ రూమ్ లో ఉంచకూడదు. కానీ తెలిసో తెలియకో చాలామంది ఆ వస్తువులను బాత్ రూమ్ లో పెడుతుంటారు. ఈ పొరపాటే వాస్తు దోషాన్ని క్రియేట్ చేస్తుంది. ఈవిధంగా బాత్ రూమ్ లో పెట్టకూడని కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Also read : Top 10 richest actresses: బాలీవుడ్ తారల ఆదాయం, రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
-
బాత్ రూమ్ లో చాలామంది ఖాళీ బకెట్ ను పెడుతుంటారు. ఇలా చేయకూడదు. వాస్తవానికి ఖాళీ బకెట్ అనేది దురదృష్టానికి సంకేతమని చాలామందికి తెలియదు.
-
బాత్ రూమ్ లోని నల్లా నుంచి నీళ్లు లీకవుతూ ఉంటే మంచిది కాదు. అదే విధంగా మీ ఇంట్లోని డబ్బంతా వేస్ట్ గా ఖర్చయిపోతూ ఉంటుంది. అందుకే నల్లా లీకేజీ ప్రాబ్లమ్ ఉంటే వెంటనే రిపేర్ చేయించుకోండి.
-
మీ ఇంటి బాత్ రూమ్ లో పగిలిన అద్దాన్ని పెట్టకూడదు. అది మీ ఇంట్లో వాస్తు దోషాలను క్రియేట్ చేస్తుంది. మీ ఇంట్లోకి పేదరికం వస్తుంది.
-
పాడైపోయి, తెగిపోయిన చెప్పులను కొందరు బాత్ రూమ్ లో వదులుతుంటారు. ఇది మంచిదికాదు. నెగెటివ్ శక్తిని కలిగిన పాత చెప్పులను బాత్ రూమ్ కు దూరంగా ఉంచాలి.
-
మీ ఇంటి బాత్ రూమ్ లో తడి వస్త్రాలను ఉంచకూడదు. వాటిని వెంటనే బయటికి తీసుకెళ్లి ఆరబెట్టాలి. ఒకవేళ బాత్ రూమ్ లోనే వాటిని వదిలితే దోషం కలుగుతుంది.
-
మీ బాత్ రూమ్ లో మొక్కలను ఉంచకూడదు. ఒకవేళ అక్కడ మొక్కలను ఉంచినా చనిపోతాయి. ఇంట్లో మొక్కలు చనిపోతే అది వాస్తు దోషం (Bathroom Vastu) కలిగిస్తుంది.